6500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్?
పోకో నుంచి త్వరలో M సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. పోకో M8 ప్రో పేరుతో (Poco M8 Pro 5G Smartphone) విడుదల కానుంది. ఈ ఫోన్ జనవరి 2026 లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన తేదీ వెల్లడి కావాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.
స్నాప్‌డ్రాగన్ చిప్! :
టిప్‌స్టర్ సుధన్షు అంబోర్ ఈ హ్యాండ్‌సెట్ వివరాలను లీక్ చేశారు. ఈ వివరాల ఆధారంగా పోకో M8 ప్రో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 పైన పనిచేస్తుందని తెలిపారు.

క్వాడ్ కర్వడ్ డిస్‌ప్లే! :
ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K (2772 x 1280 పిక్సల్స్) క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుందని చెప్పారు.
50MP OIS కెమెరా! :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలిపారు. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుందన్నారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో లాంచ్ కానుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
POCO M8 Pro 5G all renders & full specs (thread)
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) December 27, 2025
- Snapdragon 7s Gen 4
- 6.83" Quad Curved AMOLED, 2772 x 1280, 120Hz, Corning Gorilla Glass Victus 2
- 50MP Main (OIS) + 8MP Ultrawide + 32MP Selfie
- 6500mAh (region dependent), 100W
- Android 15, HyperOS 2
- Optical fps,… pic.twitter.com/e53v1r6o5M
6500mAh బ్యాటరీ! :
ఈ హ్యాండ్‌సెట్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వైఫై 5, బ్లూటూత్ 5.4, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 7.9mm థిక్‌నెస్‌తో 207 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఎంత ధరలో విడుదల కానుంది? :
భారత్ మార్కెట్లో పోకో M8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.20 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లపై పోకో ఎటువంటి అధికారిక స్పందన తెలియజేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ఇటీవలే బడ్జెట్ ధరలో 5G ఫోన్ :
ఈ సంవత్సరం డిసెంబర్‌లో పోకో C85 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది. 6.9 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP AI ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








