ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్..!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ సేల్‌కు సంబంధించి క్రమంగా అనేక డీల్స్‌ను వెల్లడిస్తోంది. ఇటీవలే గూగుల్ పిక్సల్ ఫోన్‌లకు సంబంధించిన డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ లో (Flipkart Big Billion Days Sale 2025) భాగంగా పోకో ఫోన్‌ల డిస్కౌంట్ ఆఫర్లు, ఇతర డీల్స్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో పోకో F7 ఫోన్‌తోపాటు పోకో F7, X7 ప్రో, M7 ప్లస్ సహా అనేక మోడల్స్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

పోకో F7 స్మార్ట్‌ఫోన్ :
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ధరల వివరాలు సెప్టెంబర్ 15 వ తేదీ సాయంత్రం 7 గంటలకు వెల్లడికానున్నాయి. పోకో F7 స్మార్ట్‌ఫోన్ (Poco F7 5G Smartphone) గురించి విడుదల సమయంలో ఎక్కువగా చర్చ జరిగింది. ఎందుకంటే ఈ ఫోన్ ఏకంగా 7550mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
మరియు పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. విడుదల సమయంలో ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.27 వేల నుంచి రూ.28 వేల ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Performance that screams power, price that whispers madness. 🔥
— POCO India (@IndiaPOCO) September 10, 2025
POCO fam, tell us your dream price in the comments👇 for the POCOX7 Pro 5G. 💛
Reveal on 15th Sept, 7PM on Flipkart. 🗓️
⚡Stay tuned for more PRICE DROPS as we gear up for Flipkart’s Big Billion Days Sale 👀 pic.twitter.com/8np9F4ntPt
పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ సంవత్సరం తొలి భాగంలో పోకో X7 ప్రో మోడల్ (Poco X7 Pro Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 6550mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 లో భాగంగా ఈ పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే డిస్కౌంట్ ఆఫర్లతో రూ.18999 ధరకే కొనుగోలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
భారీ బ్యాటరీ బడ్జెట్ ఫోన్‌పైనా.. :
పోకో M7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ (Poco M7 Plus Smartphone) ఇటీవల ఎక్కువగా చర్చించిన మోడల్‌గా నిలిచింది. ఎందుకంటే ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది.
విడుదల సమయంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13999 గా ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.10999 కే అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు పోకో C75 5G, పోకో M7 ప్రో 5G సహా అనేక మోడల్స్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








