Home
Mobile

Poco నుంచి రెండు స‌రికొత్త 5G స్మార్ట్ ఫోన్లు.. విడుద‌ల ఎప్పుడంటే!

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ Poco గ్లోబ‌ల్ మార్కెట్లోకి మ‌రో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. Poco F4 5G, Poco X4 GT 5G మొబైల్స్‌ను జూన్ 23న గ్లోబ‌ల్ మార్కెట్లో విడుద‌ల చేయ‌నుంది. గ్లోబ‌ల్ మార్కెట్లో జూన్ 23వ తేదీన రాత్రి 8 గంట‌ల‌కు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు కంపెనీ వ‌ర్గాలు ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాయి. "జూన్ 23న రెండు స‌రికొత్త మొబైల్స్ Poco F4 5G, Poco X4 GT 5G ల‌ను విడుద‌ల చేస్తున్నాం. మిస్ అవ‌కండి" అని కంపెనీ ట్వీట్‌లో పేర్కొంది.

Poco X4 GT 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

Poco X4 GT 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

గ్లోబ‌ల్ మార్కెట్లో పోకో ఈవెంట్ తేదీ జూన్ 23వ తేదీన రాత్రి 8 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 24వ తేదీ తెల్ల‌వారుజామున 1:30 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మొబైల్ ఇటీవ‌ల చైనాలో విడుద‌లైన‌ Redme Note 11T Pro కు రిబ్రాండెడ్ వ‌ర్శ‌న్‌గా ఉండ‌నుంద‌ని కొన్ని రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఒక‌వేళ అదే నిజ‌మైతే అందులోని ఫీచ‌ర్ల‌నే ఈ మొబైల్‌లోనూ చూడ‌వ‌చ్చు. 

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ ను అల్యూమినియం తో స్క్వేర్ షేప్‌లో రూపొందించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12ఓఎస్ (MIUI custom OS) పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 48 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

Poco X4 GT 5G ధ‌ర‌..
Poco X4 GT 5G ప‌వ‌ర్ ఫుల్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌. ఈ మొబైల్ కు భార‌త మార్కెట్లో మంచి డిమాండ్ ఉండ‌నుంది. దీని స్పెసిఫికేష‌న్స్ మ‌రియు ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే దీని ధ‌ర భార‌త మార్కెట్లో రూ.25వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Poco F4 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

Poco F4 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు..

ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+అమోల్డ్‌ పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్ ను క‌లిగి ఉంది. ఇది 12జీబీ ర్యామ్‌, 256జీబీ (3.1స్టోరేజీ ఆప్ష‌న్‌) ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ లిక్విడ్ కూల్ 2.0 టెక్నాల‌జీ తో త‌యారు చేశారు. ఈ మొబైల్ స్నాప్ డ్రాగ‌న్ 870 SoC ప్రాసెస‌ర్‌ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 20 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4520mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. దీన్ని ఇప్ప‌టికే విడుద‌లైన‌ రెడ్ మీ కే4ఓఎస్ కు రిబ్రాండెడ్ వ‌ర్శ‌న్ ప‌లువురు చెబుతున్నారు.

Poco F4 5G ధ‌ర‌..
Poco F4 5G ప‌వ‌ర్ ఫుల్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌. ఈ మొబైల్ కు భార‌త మార్కెట్లో మంచి డిమాండ్ ఉండ‌నుంది. దీని స్పెసిఫికేష‌న్స్ మ‌రియు ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే దీని ధ‌ర భార‌త మార్కెట్లో రూ.26,999 గా ఉండొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ‌ర్ల‌తో క‌లిపి రూ.23,999 ధ‌ర‌కు వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

 

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న పోకో మొబైల్స్ వివ‌రాలు..

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న పోకో మొబైల్స్ వివ‌రాలు..

భార‌త్‌లో ప్ర‌స్తుతం Poco X4 ప్రో 5జీ అందుబాటులో ఉంది. ఈ మొబైల్ కు 6.67 అంగుళాల ఫుల్ HD+ LCD పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో రానుంది. ఇది 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Poco X4 GT 5G Launching On June 23 Alongside Poco F4 5
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X