ధర రూ.18,999 కే 12GB ర్యామ్, 512GB స్టోరేజీ, 64MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్.. పూర్తి వివరాలు..!
దీపావళి సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపాళి సేల్ అక్టోబర్ 21 వ తేదీన ప్రారంభం అయింది. ఇవాళ్టితో ముగుస్తుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌లకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్‌లో (Flipkart Big Diwali Sale 2024) భాగంగా పోకో X6 హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఈ సంవత్సరం జనవరిలో భారత్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు.
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ (Poco X6 5G Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తోంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్‌ను రూ.16,999 కు కొనుగోలు చేయవచ్చు.

12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ను ప్రస్తుతం రూ.17,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ దీపావళీ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.
పోకో X6 5G హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 2 SoC చిప్‌సెట్ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లను పొందవచ్చని సంస్థ వెల్లడించింది.
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యా్క్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. మరియు భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. బ్లూటూత్ 5.2, వైఫై 5 వంటి ఫీచర్ లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








