Poco స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీ వేరియంట్ విడుదల.. ఈ బ్యాంకు కార్డులపై రూ.3000 తగ్గింపు..!
పోకో సంస్థ నుంచి ఇటీవల లాంచ్ అయిన పోకో X6 5G (Poco X6 5G Smartphone) స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ లాంచ్ అయింది. భారత్ మార్కెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన నెల రోజుల తర్వాత తాజాగా 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను లాంచ్ చేసింది.
పోకో x6 5G స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు : ప్రస్తుతం కొత్త వేరియంట్‌తో (Poco X6 5G New Variant) కలిపి Poco X6 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ +512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7s Gen 2 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది.

పోకో x6 5G కొత్త వేరియంట్ ధర రూ.3000 తగ్గింపు : తాజాగా లాంచ్ చేసిన 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ ప్రస్తుతం రూ.23,999గా ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో మిర్రర్ బ్లాక్, స్నోస్ట్రూమ్ వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ICICI, HDFC, యాక్సిస్, SBI కార్డుల ద్వారా కొనుగోలు చేసినా లేదా EMI లావాదేవీలు నిర్వహించినా రూ.3000 తగ్గింపును పొందవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు స్టోరేజీ వేరియంట్లు 8GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.21,999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. భారత్ మార్కెట్‌లో పోకో x6 5G స్మార్ట్ ఫోన్ జనవరిలో అందుబాటులోకి వచ్చింది.

పోకో x6 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు : ఈ పోకో హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల 1.5k అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1220*2712 పిక్సల్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 7S Gen 2 SoC చిప్‌తో వస్తుంది.
పోకో x6 5G కెమెరా, బ్యాటరీ వివరాలు : పోకో స్మార్ట్ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








