64MP కెమెరా, 12GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2000 తగ్గింపు.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..!
పోకో సంస్థ మార్చి 13న భారత్ మార్కెట్‌లో పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరిలో పోకో X6 5G, పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అయితే పోకో X6 5G హ్యాండ్‌సెట్ (Poco X6 5G Smartphone) ధరను తగ్గించింది.
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు : ప్రస్తుతం పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. తాజాగా ఈ ఫోన్ ధరను రూ.2000 చొప్పున తగ్గించింది.

ఫలితంగా ఈ ఫోన్ ( Poco X6 5G Pricecut 2024 ) 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.15,649 వరకు ప్రయోజనం పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ పోకో X6 5G స్మార్ట్‌ఫోన్‌ను మిర్రర్ బ్లాక్, స్నో స్ట్రోమ్ వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గ్లాస్ విస్టస్ రక్షణను కలిగి ఉంటుంది.
పోకో X6 5G హ్యాండ్‌సెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో వచ్చింది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IR బ్లాస్టర్‌ను కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS : ఈ పోకో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షియోమీ HyperOS పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ అడెన్నో 710 GPUతో జతచేయబడుతుంది. ఈ చిప్‌సెట్ గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.
64MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా : ఈ పోకో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








