Home
Mobile

ధర రూ.10999 కే 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌..!

భారత్‌ మార్కెట్‌ లో పోకో నుంచి అనేక హాండ్‌సెట్‌లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే మెరుగైన స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లతో పోకో స్మార్ట్‌ఫోన్‌ లు విడుదల అవుతున్నాయి. భారత్‌ లో డిమాండ్‌ ఉన్న బ్రాండ్‌లలో పోకో కూడా చేరింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Poco X6 Neo 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల ధరతో పోలిస్తే సుమారు రూ.5,000 డిస్కౌంట్‌ ధరతో సొంతం చేసుకోవచ్చు. భారత్‌ లో గత సంవత్సరం మార్చి నెలలో ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ రూ.15,999 గా ఉండేది. 12GB వేరియంట్ ధర రూ.17,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Poco X6 Neo 5G Smartphone price

పోకో X6 నియో 5G ఫోన్‌ 8GB ర్యామ్ వేరియంట్‌ రూ.11,999 గా ఉంది. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు అన్ని బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై రూ.1000 కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.10,999 గా ఉండనుంది.

మూడు రంగుల్లో అందుబాటులోకి.. :
ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌పైన మాత్రమే ప్రస్తుతం ఈ డిస్కౌంట్ ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ అస్ట్రల్‌ బ్లాక్‌, మార్టిన్‌ ఆరెంజ్‌, హారిజన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

Poco X6 Neo 5G Smartphone price

పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
పోకో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 93.3 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది.

ఈ పోకో హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 SoC ప్రాసెసర్‌ తో పనిచేస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ లు పొందుతుందని సంస్థ తెలిపింది. ఫోన్‌ వేడెక్కకుండా గ్రాఫైట్‌ షీట్‌లను కలిగి ఉంది.

108MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ పోకో 5G ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై 802, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. యాక్సిలిరోమీటర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ, ఇ-కంపాస్‌, IR బ్లాస్టర్‌, యాంబియంట్ లైట్ సెన్సార్‌ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ను అమర్చి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X6 Neo 5G Smartphone gets best deal on Flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X