ధర రూ.11,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ 5G స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో సేల్..!!
భారత్ మార్కెట్ లో పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ (Poco X6 Neo 5G Smartphone) ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధర రేంజ్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్ సెట్ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండగా.. ప్రస్తుతం అమెజాన్ లో (Amazon) రూ.3000 ధర తగ్గింపు సహా రూ.1000 కూపన్ డిస్కౌంట్ ను పొందవచ్చు. హారిజన్ బ్లూ, అస్ట్రల్ బ్లాక్, మార్టిన్ ఆరెంజ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
రూ.1000 కూపన్ డిస్కౌంట్ :
పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రెండు వేరియంట్ల లో లభిస్తుంది. 8GB ర్యామ్ +128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర విడుదల సమయంలో రూ.15999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్ లో రూ.12999 కే అందుబాటులో ఉంది. దీంతోపాటు కూపన్ డిస్కౌంట్ ద్వారా రూ.1000 అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు.

పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
పోకో X6 నియో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా ఉండేలా గ్రాఫైట్ షీట్ లను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో రక్షణ కలిగి ఉంటుంది.
4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లు :
ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పైన పనిచేస్తోంది. మరియు 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్ లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్ లు అందుకోవచ్చని పోకో వెల్లడించింది. ఈ హ్యాండ్ సెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేస్‌లాక్‌తో పనిచేస్తోంది.
108MP కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో X6 నియో 5G హ్యాండ్ సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను అమర్చి ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్ సెట్ కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi 802, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటి ఫీచర్లు కలిగి ఉంది. సెన్సార్‌ల పరంగా యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలిరోమీటర్, ఇ-కంపాస్, గైరోస్కోప్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్ లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








