ధర రూ.14,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ పోకో 5G స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
పోకో సంస్థ భారత్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో X6 నియో 5G (Poco X6 Neo 5G Smartphone Launched) ఇవాళ లాంచ్ అయింది. ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 13R ప్రో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మరియు 108MP కెమెరాను కలిగి ఉంటుంది.
పోకో X6 నియో 5G స్పెసిఫికేషన్లు :
పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో డిస్‌ప్లే రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్రాఫైట్ షీట్లను కలిగి ఉంటుంది. గేమింగ్ సమయంలో హ్యాండ్‌సెట్ ఎక్కువ వెడెక్కకుండా చూస్తుంది.

ఈ పోకో X6 నియో 5G హ్యాండ్‌సెట్ (Poco X6 Neo 5G specs) 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ Mail G57 MC2 తో జతచేయబడి ఉంటుంది. మరియు 12GB LPDDR4X ర్యామ్, గరిష్ఠంగా 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంది.
ఈ ఫోన్ ర్యామ్‌ను 24GB వరకు వర్చువల్‌గా విస్తరించే అవకాశం ఉంది. మరియు ఈ పోకో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ పేర్కొంది.

ఈ పోకో కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 3X జూమింగ్ సామర్థ్యంతో 108MP శాంసంగ్ ISOCELL HM6 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 2MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 5G, బ్లూటూత్ 5.3, వైఫై 802, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి కనెక్టివిటి ఫీచర్లు కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పేస్ లాక్‌ను కలిగి ఉంది. ఈ పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో ఒక ఆడియో స్పీకర్‌ను కలిగి ఉంటుంది.
పోకో X6 నియో 5G ధర :
పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ మోడల్ ధర రూ.17,999 గా ఉంది. ఈ ఫోన్ అస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్టిన్ ఆరెంజ్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ పోకో కొత్త హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు లిమిటెడ్ సేల్ ప్రారంభం అవుతుంది. మార్చి 18 నుంచి రెండో సేల్ ప్రారంభం అవుతుంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినా, EMI లావాదేవీలు నిర్వహించినా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా అదనంగా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








