Home
Mobile

108MP కెమెరా, 256GB స్టోరేజీ POCO స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. ఈ బ్యాంకు కార్డులపై ధర తగ్గింపు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో ఇటీవల భారత్ మార్కెట్‌లో పోకో X6 నియో 5G (POCO X6 Neo sale) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తాజా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇవా‌ళ్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు పోకో అన్ని ఫోన్లలో అత్యంత సన్నని ఫోన్‌గా గుర్తింపు పొందింది.

పోకో X6 నియో స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ రూ.15,999 గా ఉంది. మరియు 12GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.17,999 గా ఉంది. SBI, ఐసీఐసీఐ, HDFC, యాక్సి‌స్‌ బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

POCO X6 Neo 5G Smartphone

దీంతోపాటు ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు తొలి 1000 మంది కొనుగోలుదారులకు పోకో ఆకట్టుకొనే ఆఫర్‌ను ప్రకటన చేసింది. వారు రూ.1000 విలువైన మింత్రా కూపర్లను పొందవచ్చని తెలిపింది. ఈ పోకో కొత్తఫోన్‌ను అస్ట్రల్‌ బ్లాక్‌, హారిజన్ బ్లూ, మార్టిన్‌ ఆరెంజ్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ అయింది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5తో డిస్‌ప్లే రక్షణ పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ గ్రాఫైట్‌ షీట్లను కలిగి ఉంటుంది. గేమింగ్‌ సమయంలో హ్యాండ్‌సెట్‌ ఎక్కువ వేడెక్కకుండా చూస్తుంది.

POCO X6 Neo 5G Smartphone

ఈ పోకో X6 నియో 5G హ్యాండ్‌సెట్‌ 6nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ Mail G57 MC2 తో జతచేయబడి ఉంటుంది. మరియు 12GB LPDDR4X ర్యామ్‌, గరిష్ఠంగా 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడి ఉంది. 24GB ర్యామ్‌ వరకు వర్చువల్‌గా విస్తరించే అవకాశం ఉంది.

ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ పేర్కొంది. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత పేస్‌ లాక్‌ను కలిగి ఉంది.

POCO X6 Neo 5G Smartphone

ఈ పోకో కొత్త హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 3X జూమింగ్‌ సామర్థ్యంతో 108MP శాంసంగ్ ISOCELL HM6 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 2MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ పోకో X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, బ్లూటూత్‌ 5.3, వైఫై 802, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టు వంటి కనెక్టివిటి ఫీచర్లు కలిగి ఉంటుంది. దీంతోపాటు యాక్సిలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఇ-కంపాస్‌, గైరోస్కోప్, IR బ్లాస్టర్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
POCO X6 Neo 5G Smartphone sale is live Now on Flipkart here are the offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X