Home
Mobile

108MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్‌ తేదీ, సేల్‌ వివరాలు..!

పోకో సంస్థ తన స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్లను భారత్‌ మార్కెట్‌లో క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో పోకో X6 నియో స్మార్ట్‌ఫోన్‌ను (Poco X6 Neo Smartphone) లాంచ్‌ చేయనుంది. మార్చి 13న ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు.

అయితే పోకో X6 నియో స్మార్ట్‌ఫోన్‌ గురించి పోకో సంస్థ అధికారికంగా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ సంవత్సరం జనవరిలో పోకో X6 మరియు X6 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల అయ్యాయి. అయితే ఈ వారం ప్రారంభంలో పోకో ఇండియా హెడ్‌ హిమాన్షు టండన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లను అందించడమే పోకో లక్ష్యమని తెలిపారు.

Poco X6 Neo Smartphone to launch on march 13 in india

రూ.16,000 కంటే తక్కువ ధరకే.. ? :
అయితే కొన్ని నివేదికల ప్రకారం పోకో X6 నియో స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే మోడల్‌ నంబర్ 2312FRAFDI తో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ ను అందుకొంది. దీని ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 13R ప్రో స్మార్ట్‌ఫోన్‌ రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.16,000 కంటే తక్కువకే ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

6.67 అంగుళాల OLED డిస్‌ప్లే : పోకో X6 నియో హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది.

108MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా : అయితే ఈ పోకో X6 నియో స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉండనుంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ పోకో హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

5000mAh బ్యాటరీ సామర్థ్యం : దీంతోపాటు పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు టీజర్‌ ఆధారంగా ఈ ఫోన్‌ సొగసైన డిజైన్‌ సహా బ్లూరంగు కలక్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ పోకో X6 నియో హ్యాండ్‌సెట్ మార్చి 13న భారత్‌లో (Poco X6 Neo Smartphone Sale) విడుదల కానుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X6 Neo Smartphone to launch on march 13 in india with 108MP Primary camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X