నాలుగు నెలల్లోనే 64MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3000 తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 ప్రస్తుతం జరుగుతోంది. రేపటి వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన పోకో X6 ప్రో 5G పై భారీ తగ్గింపును పొందవచ్చు. విడుదలతో పోలిస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Poco X6 pro 5G) 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ విడుదల సమయంలో రూ.26999 గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.23999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.25,999 గా ఉంది.

ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్‌ను రూ.22,999 కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.21000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రేసింగ్ గ్రే, స్పెక్టర్ బ్లాక్ మరియు పసుపు పసుపు రంగుల్లో కొనుగోలుకు చేసేందుకు అందుబాటులో ఉంది.
పోకో X6 ప్రో స్పెసిఫికేషన్లు..
పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
ఈ పోకో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు Mail G615 చిప్‌సెట్‌తో జతచేయబడి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP మరియు 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా పోకో X6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.4, Wi-Fi 6, NFC, IR బ్లాస్టర్ మరియు USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌గా వచ్చింది. భద్రత పరంగా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








