Home
Mobile

6550mAh బ్యాటరీ, 12GB ర్యామ్‌, 6.73 అంగుళాల డిస్‌ప్లేతో 5G ఫోన్ విడుదల.. రూ.3000 డిస్కౌంట్‌!

పోకో X7 5G సిరీస్‌ (Poco X7 5G Series Launched) భారత్‌ మార్కెట్లో ఇవాళ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7 5G, పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ సిరీస్ ప్రో మోడల్‌ 6500mAh బ్యాటరీతో లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్‌ గెరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణ పొందుతుంది. TUV Rheinland లో బ్లూ లైట్‌ మరియు ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

Poco X7 5G Series Launched in india

ప్రాసెసర్‌, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. LPDDR4X ర్యామ్ మరియు UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్‌లు :
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. OIS, EIS సపోర్టు, F/1.59 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI ఇమేజింగ్‌, ఫోటో ఎడిటింగ్‌, పోకో AI నోట్స్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

Poco X7 5G Series Launched in india

పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ప్రో మోడల్ 6.73 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గెరెల్లా గ్లాస్‌ 7i రక్షణను కలిగి ఉంది. TUV Rheinland లో బ్లూ లైట్‌ మరియు ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

భారీ బ్యాటరీ.. 47 నిమిషాల్లోనే ఛార్జింగ్ :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. LPDDR5X ర్యామ్ మరియు UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంది. 90W Hyper Charge సపోర్టుతో 6550mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.

సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. AI ఇమేజింగ్‌, ఫోటో ఎడిటింగ్‌, పోకో AI నోట్స్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. ఈ సిరీస్‌ IP66+ IP68+ IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌తో లాంచ్‌ అయింది. కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్‌, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

Poco X7 5G Series Launched in india

పోకో X7 5G సిరీస్‌ ధర సేల్‌ వివరాలు :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco X7 5G Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ఈ ఫోన్ కాస్మిక్‌ సిల్వర్‌, గ్లేసియర్‌ గ్రీన్‌, పోకో యెల్లో రంగుల్లో లభిస్తుంది. జనవరి 17 నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభం కానుంది.

పోకో X7 ప్రో 5G హ్యాండ్‌సెట్ (Poco X7 Pro 5G Sale) 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.26,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28999 గా ఉంది. ఒబ్సిడియన్‌ బ్లాక్‌, పోకో యెల్లో, నెబ్యులా గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ప్రో మోడల్‌ జనవరి 14 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

Poco X7 5G Series Launched in india

పోకో X7 5G సిరీస్‌ను ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ప్రో మోడల్‌ సేల్‌ ప్రారంభమైన తొలిరోజు కూపన్‌ కోడ్‌ ద్వారా అదనంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సిరీస్‌ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 5G Series Launched with 50MP Main Camera in india check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X