50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, AI ఫీచర్‌ల 5G ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్..!
పోకో నుంచి ఇటీవల భారత్ మార్కెట్ లో పోకో X7 5G సిరీస్ (Poco X7 5G Series) లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7 5G, పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రో మోడల్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ (Poco X7 5G Smartphone Sale) సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ పోకో ఇండియా వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
ఈ కార్డుతో రూ.2000 డిస్కౌంట్ :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.2,000 డిస్కౌంట్ ను పొందవచ్చు. పోకో యెల్లో, కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది.

పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఈ పోకో హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గెరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ పొందుతుంది.
4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు :
పోకో X7 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS సహా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.
50MP + 20MP సెల్ఫీ కెమెరాలు :
ఈ పోకో ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), F/1.59 అపేచర్ ను కలిగి ఉంది. 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
5500mAh బ్యాటరీ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు :
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. పోకో AI నోట్స్, AI ఇమేజింగ్, ఫోటో ఎడిటింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు TUV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ లను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లు సహా IP66+ IP68+ IP69 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.


Click it and Unblock the Notifications








