5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. రూ.3000 డిస్కౌంట్!
పోకో X7 5G సిరీస్ నుంచి X7 5G, X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో పోకో X7 5G హ్యాండ్‌సెట్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale 2025) జరుగుతోంది. డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.
స్టోరేజీ వేరియంట్‌లు :
విడుదల సమయంలో పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ (Poco X7 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్ లో భాగంగా 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.18999, 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.20999 కే కొనుగోలు చేయవచ్చు.

రూ.3000 డిస్కౌంట్ :
విడుదల సమయంతో పోలిస్తే రూ.3,000 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు.
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
పోకో X7 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ఈ పోకో హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల 1.5K కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ పొందుతుంది. TUV Rheinland Low Blue లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.
20MP సెల్ఫీ కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చారు. f/1.59 అపేచర్, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ LYT 600 కెమెరాను కలిగి ఉంది. మరియు 8MP అల్ట్రా వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. పోకో AI నోట్స్, AI ఇమేజింగ్, ఫోటో ఎడిటింగ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
5500mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వెట్ టచ్ డిస్‌ప్లే 2.0 ఫీచర్ సపోర్టు చేస్తుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








