Home
Mobile

ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.8 వేల డిస్కౌంట్‌.. కర్వడ్‌ డిస్‌ప్లే. IP69 రేటింగ్, 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌!

పోకో సంస్థ భారత్‌ మార్కెట్‌లో ఈ సంవత్సరం తొలి భాగంలో పోకో X7 5G సిరీస్‌ విడుదల అయింది. ఇందులో పోకో X7 5G, X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇటీవల పోకో X7 5G మోడల్‌ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ సహా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ ధర సుమారు రూ.22 వేలుగా ఉండేది. ప్రస్తుతం రూ.15 వేల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

భారత్‌లో విడుదల సమయంలో పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ (Poco X7 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉండేది. ప్రస్తుతం బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి 2025 సేల్‌లో భాగంలో భారీ డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

Poco X7 5G Smartphone price

రూ.8 వేల డిస్కౌంట్‌ :
ఈ ఫోన్ రూ.8 వేల డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా 8GB/128GB ధర రూ.13,999, 8GB/256GB వేరియంట్‌ను రూ.15,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు SBI బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మరియు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణ పొందుతోంది.

IP69 రేటింగ్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే వెట్‌ టచ్ డిస్‌ప్లే 2.0 ఫీచర్ సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులతోనూ ఈ హ్యాండ్‌సెట్‌ను ఉపయోగించుకోవచ్చు. IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Poco X7 5G Smartphone price

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP ప్రైమరీ, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను అమర్చారు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌, డాల్బీ అట్మాస్‌ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ AI Imaging, AI Notes వంటి ఫొటో ఎడిటింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 5G Smartphone gets Rs8000 Discount on Flipkart Big Bang Diwali 2025 Sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X