Home
Mobile

50MP కెమెరా, 5500mAh బ్యాటరీ, వాటర్‌ ప్రూఫ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.5000 ధర తగ్గింపు..!

Poco X7 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో ఈ సంవత్సరం జనవరిలో పోకో X7 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో పోకో X7 5G, పోకో X7 ప్రో 5G మోడల్స్‌ లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతోపాటు మెరుగైన వాటర్ ప్రూఫ్‌ ఫోన్‌గా ఉంది.

పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉండేది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Poco X7 5G Smartphone now available with Rs5000 price cut on flipkart 2025 july

రూ.5000 ధర తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. అంటే రూ.5000 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. ఈ వేరియంట్‌పైనా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. కాస్మిక్‌ సిల్వర్‌, గ్లేసియర్‌ గ్రీన్, యెల్లో కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

పోకో X7 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల 1.5K కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గెరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. వెట్‌ టచ్ డిస్‌ప్లే 2.0 ఫీచర్ ను సపోర్టు చేస్తుంది.

Poco X7 5G Smartphone now available with Rs5000 price cut on flipkart 2025 july

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ పోకో ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని పోకో తెలిపింది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

Poco X7 5G Smartphone now available with Rs5000 price cut on flipkart 2025 july

ఈ ఫోన్ AI Notes, AI Imaging, AI Photo Editing వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే TUV Rheinland Low Blue లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

పోకో X7 5G స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు IP66 + IP68 + IP69 రేటింగ్‌ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. మెరుగైన వాటర్‌ ప్రూఫ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 5G Smartphone now available with Rs5000 price cut on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X