Home
Mobile

ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఫోన్ కోసం చూస్తున్నారా.. రూ.2000 డిస్కౌంట్‌తో 6500mAh బ్యాటరీ ఫోన్‌ కొనుగోలు చేయండి..!

భారత్‌ మార్కెట్‌ లో జనవరి 9 వ తేదీన పోకో X7 సిరీస్‌ (Poco X7 5G Series) విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7, పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇవాళ్టి నుంచి X7 ప్రో 5G హ్యాండ్‌సెట్ (Poco X7 Pro 5G smartphone Sale) సేల్‌ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 6500mAh భారీ బ్యాటరీ సహా 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 1.5K ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది.

పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.26,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999 గా ఉంది. ICICI బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసి రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇవాళ అర్ధరాత్రి వరకు కూపన్ కోడ్‌ ద్వారా మరో రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Poco X7 pro 5G smartphone

పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.2000 తగ్గింపు సహా 12 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒబ్సిడియన్‌ బ్లాక్‌, పోకో యెల్లో, నెబ్యులా గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

పోకో X7 ప్రో 5G ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
పోకో X7 ప్రో 5G హ్యాండ్‌సెట్ 6.73 అంగుళాల 1.5K ఫ్లాట్‌ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 7i రక్షణను పొందుతుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

ఈ పోకో హ్యాండ్‌సెట్‌ 90W HyperCharge సపోర్టుతో 6550mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. సంస్థ అందించిన వివరాల ఆధారంగా 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ ఫోన్‌ 50MP సోనీ LYT 600 ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్‌ కెమెరాలు పోకో AI నోట్స్‌, AI ఇమేజింగ్‌, ఫోటో ఎడిటింగ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ డిస్‌ప్లే TUV Rheinland లో బ్లూ లైట్‌, ఫ్లిక్కర్‌ ఫ్రీ సర్టిఫికేషన్‌లను పొందింది. IP66+ IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 pro 5G smartphone sale is live on flipkart check price and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X