Home
Mobile

Poco X7 Series సూపర్ డిజైన్‌, స్పెసిఫికేషన్‌లతో పోకో కొత్త ఫోన్‌లు.. ఎప్పుడు విడుదల కానున్నాయంటే?

పోకో నుంచి భారత్‌ మార్కెట్‌లోకి పోకో X7 సిరీస్‌ (Poco X7 Series Launch Date in india) విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7, పోకో X7 ప్రో మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌ విడుదల తేదీని పోకో వెల్లడించింది. సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా విడుదల తేదీ సహా ఇతర వివరాలు వెల్లడించింది.

పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు విడుదల కానుంది ? :
పోకో X పోస్ట్‌ వివరాల ఆధారంగా పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 9 వ తేదీ 5.30PM గంటలకు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌ ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది.

Poco X7 Series smartphone telugu news

పోకో X7 స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
పోకో X7 స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K రిజల్యూషన్‌ డిస్‌ప్లేతో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ సపోర్టు చేస్తుంది.

ఈ డిస్‌ప్లే TUV Rhinland ఐ కేర్‌ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ విక్టస్‌ 2 రక్షణ పొందనుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ 12GB ర్యామ్ మరియు 512GB స్టోరేజీ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా పోకో X7 స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టు, 2X ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 20MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ప్రో హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల క్రిస్టల్‌Rez 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 2560Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ప్రో మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగం పరంగా f/1.5 అపేచర్‌, OIS ఫీచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరా ద్వారా 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

పోకో X7 స్మార్ట్‌ఫోన్ 45W టర్బో ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ 90W హైపర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ రెండు ఫోన్‌లు IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 Series smartphone launch date confirmed in india here are the expected features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X