Home
Mobile

పోకో X7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్‌..!!

పోకో నుంచి త్వరలో X7 సిరీస్‌ త్వరలో (Poco X7 Series Smartphones) భారత్‌ సహా ఇతర మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7, పోకో X7 ప్రో హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ విడుదల సహా ఇతర కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. టిప్‌స్టర్ పరాస్‌ గుగ్‌లానీ తాజాగా ఈ సిరీస్‌ బేస్‌, ప్రో వేరియంట్‌ల స్పెసిఫికేషన్‌ల వివరాలను వెల్లడించారు. 2025 జనవరిలో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల కానుందని తెలుస్తోంది.

పోకో X7 సిరీస్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
టిప్‌స్టర్‌ పరాస్‌ గుగ్‌లానీ వివరాల ఆధారంగా పోకో X7, ప్రో మోడళ్లు 6.67 అంగుళాల 1.5K క్రిస్టల్‌ రిజల్యూషన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 2560Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో లాంచ్ కానుంది.

Poco X7 Series Smartphones

50MP OIS కెమెరా, 5110mAh బ్యాటరీ :
పోకో X7 (Poco X7 Smartphone) మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. పోకో X7 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP OIS కెమెరా మరియు 20MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం.

పోకో X7 ప్రో (Poco X7 Pro Smartphone) స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా SoC చిప్‌సెట్‌ పైన పనిచేయనుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 (Skin) ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రో మోడల్‌ లిక్విడ్‌ కూల్‌ 4.0 కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

50MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా పోకో X7 ప్రో మోడల్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటాయి. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.5 అపేచర్‌తో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో 60fps తో 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్‌ 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ ఫిల్మ్‌, ఏఐ ఎరేజ్‌ ప్రో, AI Image Expansion వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెన్స్ తో అందుబాటులో ఉంది.

పోకో X7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 2025 జనవరి నెలలో విడుదల కానుందని వెల్లడైంది. అయితే కచ్చితంగా ఏ తేదీన లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ సంవత్సరం జనవరి నెలలోనే పోకో X6 సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 Series Smartphones specs and features leaked ahead of expected launch on january 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X