Home
Mobile

రేపు భారత్‌ మార్కెట్‌లో విడుదల కానున్న Poco X7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు.. పూర్తి వివరాలు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ పోకో నుంచి రేపు భారత్‌ మార్కెట్‌లోకి X7 సిరీస్‌ (Poco X7 Series Launch) విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X7, పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9 వ తేదీ 5:30 PM గంటలకు ఈ సిరీస్‌ లాంచ్‌ కానుంది. ఈ లాంచ్‌ ఈవెంట్‌ను పోకో యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా వీక్షించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు పూర్తి వివరాలు.

ఈ పోకో X7 సిరీస్‌ ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ డిజైన్‌ సహా కలర్‌ వేరియంట్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ టాప్ ఎండ్ మోడల్‌ రూ.30000 కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

Poco X7 Series smartphones

పోకో X7 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు! :
పోకో X7 స్మార్ట్‌ఫోన్‌ (Poco X7 Smartphone) 1.5K 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. LPDDR5X ర్యామ్ UFS 4.0 స్టోరేజీతో జత చేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 OS తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్‌, AI ఎరేజ్‌ ప్రో వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై, బ్లూటూత్‌, వైఫై, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది.

పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు! :
పోకో X7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Poco X7 Pro Smartphone) 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఈ డిస్‌ప్లే 2560Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ప్రో మోడల్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. LPDDR5X ర్యామ్ UFS 4.0 స్టోరేజీతో జత చేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 OS తో పనిచేస్తుందని తెలుస్తోంది. 90W వైర్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా 50MP OIS కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రైమరీ కెమెరాతో 4K నాణ్యతతో వీడియోలను రికార్టు చేయవచ్చు. ప్రో మోడల్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X7 Series smartphones to launch on tomorrow in india here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X