Home
Mobile

6500mAh బ్యాటరీ, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50MP OIS కెమెరా, IP69K రేటింగ్‌తో స్మార్ట్‌ఫోన్‌

భారత్ మార్కెట్‌లో పోకో X8 ప్రో 5G సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా పోకో X8 ప్రో 5G, పోకో X8 ప్రో మ్యాక్స్‌ 5G, పోకో X8 ప్రో ఐరన్‌ మ్యాన్‌ ఎడిషన్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రో స్మార్ట్‌ఫోన్‌ (Poco X8 pro 5G) ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. IP69K రేటింగ్‌ను కలిగి ఉంది. తొలి సేల్‌లో భాగంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

పోకో X8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. SGS సర్టిఫికేషన్‌ కూడా ఉంది.

Poco X8 pro 5G Smartphone

అల్ట్రా చిప్‌, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ ఫోన్‌ 4nm ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8500 అల్ట్రా SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్, 256GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. 5300 Sq mm 3D Ice లూప్ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

50MP OIS కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) తో 50MP కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది. 60fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

వాటర్‌ రెసిస్టెంట్‌ :
పోకో X8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్‌ రివర్స్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్పీకర్లు ఉన్నాయి.

పోకో X8 ప్రో సిరీస్‌ ధర, సేల్‌ :
పోకో X8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ ధర రూ.32,999, 12GB ర్యా్మ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.35,999 గా ఉంది. ఐరన్‌ మ్యాన్‌ ఎడిషన్ 12GB/256GB వేరియంట్ ధర రూ.34,999 గా ఉంది.

ఈ ఫోన్ సేల్‌ మార్చి 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, HDFC బ్యాంకు కార్డులపై రూ.3 వేల డిస్కౌంట్‌ను అందిస్తోంది. బ్లాక్‌, గ్రీన్‌, వైట్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X8 pro 5G Smartphone with Mediatek Dimensity 8400 Ultra Chip, 6500mAh Battery launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X