Home
Mobile

భారీ బ్యాటరీ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఏకంగా 9000mAh బ్యాటరీ, 6.83 అంగుళాల డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌!

Poco X8 Pro Max 5G Smartphone : పోకో X8 ప్రో 5G సిరీస్‌ ఇవాళ విడుదల అయింది. ఈ సిరీస్‌లో పోకో X8 ప్రో 5G, పోకో X8 ప్రో మ్యాక్స్‌ 5G, పోకో X8 ప్రో 5G ఐరన్‌ మ్యాన్‌ ఎడిషన్‌ విడుదల అయ్యాయి. మ్యాక్స్‌ మోడల్‌ 9000mAh భారీ బ్యాటరీ, 50MP OIS కెమెరా, కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. బ్యాంకు కార్డులపై రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

పోకో X8 ప్రో మ్యాక్స్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 3840Hz డిమ్మింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ ను కలిగి ఉంటుంది.

Poco X8 Pro Max 5G

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
ఈ మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDRx అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 5800 Sq mm 3D Ice లూప్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) తో 50MP కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP కెమెరాను కలిగి ఉంది. 60fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.

భారీ బ్యాటరీ :
ఈ ఫోన్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 27W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 9000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 3 రోజులపాటు వినియోగించుకోవచ్చని పోకో చెబుతోంది.

ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 + IP69K రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. ఈ మోడల్‌ వైట్‌, బ్లూ, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

పోకో X8 ప్రో మ్యాక్స్‌ 5G ధర, సేల్‌ :
ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.42999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.46999 గా ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ మార్చి 23 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలి సేల్‌ లో భాగంగా HDFC, ICICI, SBI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ వైట్‌, బ్లూ, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Poco X8 Pro Max 5G smartphone launched with 9000mAh large battery in india features, price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X