భారీ బ్యాటరీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో రెండు స్మార్ట్‌ఫోన్‌లు.. కీలక వివరాల లీక్..!
పోకో సంస్థ భారత్ మార్కెట్ (Poco India) ఈ సంవత్సరం జనవరి నెలలో పోకో M8 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, IP65, IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. త్వరలో మరో సిరీస్ విడుదల కానుందని తెలుస్తోంది.
పోకో X8 ప్రో సిరీస్ :
భారత్ లో త్వరలో పోకో నుంచి మరో రెండు ఫోన్‌లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. పోకో X8 ప్రో సిరీస్ (Poco X8 Pro Series) పేరుతో అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఇందులో భాగంగా పోకో X8 ప్రో, పోకో X8 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. అయితే పోకో ఇండియా మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఎప్పుడు లాంచ్ కానున్నాయి? :
పోకో హ్యాండ్‌సెట్ కోసం తాజాగా కీలక వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ X హ్యాండిల్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. టిప్‌స్టర్ వెల్లడించిన వివరాల ఆధారంగా మార్చి నెల మధ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పోకో X8 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 36,12,095 AnTuTu స్కోర్‌ను కలిగి ఉందని టిప్‌స్టర్ తెలిపారు. దీంతోపాటు TDRA లిస్టింగ్‌లో ఈ రెండు ఫోన్‌లు 2511FPC34G, 2602BPC18G మోడల్ నంబర్లతో కనిపించిందని తెలిపారు. చైనాలో గత నెలలో లాంచ్ అయిన రెడ్‌మి టర్బో 5, టర్బో 5 ప్రో మ్యాక్స్ మోడల్స్ రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉంటుందని తెలిపారు.
POCO X8 Pro Series key details.
— Abhishek Yadav (@yabhishekhd) February 19, 2026
• POCO X8 Pro Max — Dimensity 9500s, dual flash
• POCO X8 Pro — Dimensity 8500 Ultra, single flash
POCO X8 Pro Max (expected)
📱 6.83" 1.5K TCL M10 OLED, 120Hz, 2000 nits HBM, 3840Hz PWM
⚙️ Dimensity 9500s + Immortalis-G925 MC12
💾 LPDDR5x… pic.twitter.com/6ASMWHOSn9
కర్వడ్ ఎడ్జ్, మ్యాటీ ఫినిష్ :
ఈ లిస్టింగ్‌తోపాటు లీక్స్ ఆధారంగా పోకో X8 ప్రో స్మార్ట్‌ఫోన్ కర్వడ్ ఎడ్జ్‌లతో కూడిన మ్యాటీ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్, వైట్, టర్కోయిస్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పిల్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని సమాచారం. స్లిమ్ బెజెల్స్ తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
అంచనా స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు! :
అదే పోకో X8 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ కూడా బేస్ వేరియంట్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల 1.5k OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే మ్యాక్స్ మోడల్ 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
ఈ సిరీస్ బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, 100W ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
మ్యాక్స్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ మోడల్ ఏకంగా 8500mAh బ్యాటరీతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP లైట్ హంటర్ 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








