దొంగలించిన ఫోన్లతో ఎన్ని నేరాలు చేస్తారో చూడండి! నిజంగా జరిగిన సంఘటన.

By Maheswara
|

ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రకటనలు మరియు అమ్మకాలు అందించడం ద్వారా కండక్టర్లు మరియు రిక్షా పుల్లర్లు మరియు సామాన్య పౌరుల సిమ్ కార్డులను ఉపయోగించి దొంగతనాలు, మోసాలకు పాల్పడే ముఠాను కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌరంగ కీర్తానియా అలియాస్ ఆకాష్ (29) అనే వ్యక్తి అరెస్ట్ కూడా చేసారు.

 

 ఆన్ లైన్ వెబ్సైట్లలో ప్రకటన

ఆన్ లైన్ వెబ్సైట్లలో ప్రకటన

చంద్ర దీప్ సింగ్ అని పిలవబడే కోల్‌కతా కు చెందిన వ్యక్తి తన బైక్ ను అమ్మడానికి, ఆన్ లైన్ వెబ్సైట్లలో ప్రకటన ఇచ్చాడు.ఈ ప్రకటన చూసిన నిందితుడు చంద్ర దీప్ సింగ్ ను ఫోన్ ద్వారా మాట్లాడి, పర్సనల్ గా కలవాలని, బైక్ ను టెస్ట్ రైడ్ చేయాలనీ నచ్చ చేప్పి ఒప్పించాడు. సింగ్ అతన్ని పూర్తిగా నమ్మాడు. ఆ నమ్మకం తోనే టెస్ట్ రైడ్ కు బైక్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.ఇదే అదనుగా నిందితుడు బైక్ తో అలాగే ఉడాయించాడు.

Also Read: Google Photos లో ఉచిత అపరిమిత స్టోరేజ్ ఇక కుదరదు!!! ఎప్పటి నుంచో తెలుసాAlso Read: Google Photos లో ఉచిత అపరిమిత స్టోరేజ్ ఇక కుదరదు!!! ఎప్పటి నుంచో తెలుసా

నిందితుడు వాడిన ఫోన్ నెంబర్
 

నిందితుడు వాడిన ఫోన్ నెంబర్

ఆ తర్వాత విషయం గ్రహించిన చంద్ర దీప్ సింగ్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోయేసరికి, విషయాన్నీ పోలీస్ లకి వివరించి పోలీస్ పిర్యాదు ఇచ్చాడు.విచారణ  చేపట్టిన పోలీసులు ఆశ్చర్య పోయే విషయాలను కనుగొన్నారు.అసలు, నిందితుడు వాడిన ఫోన్ నెంబర్ సొంత నెంబర్ కాదని, అది ఓకే రిక్షా తొలి వ్యక్తిదని తెలిసి వివరాలు ఆరా తీశారు. ఆ రిక్షా వ్యక్తి  నుంచి మొబైల్ సిమ్ కార్డును దొంగిలించి ఈ పని చేసినట్లు కనుగొన్నారు.

 

ఇలాంటి దొంగతనాలు చేయడానికే

ఇలాంటి దొంగతనాలు చేయడానికే

పోలీసుల విచారణలో వీళ్ళు ఒక ముఠా అని, ఇలాంటి దొంగతనాలు చేయడానికే వీరు మొదట గా  మొబైల్ ఫోన్లు దొంగతనం చేసి వాటి సిమ్ కార్డుల ద్వారా తామే ఆ వ్యక్తులమని నమ్మించి, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. సాధారణం గా మొబైల్ దొంగతనాలు ఫోన్ల కోసం మరియు వాటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులకోసం జరుగుతుంటాయి.కానీ, ఈ రకం దొంగతనాలు కొత్త అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

 

ముఖ్యమైన గమనిక

ముఖ్యమైన గమనిక

సాధారణ పౌరులకు ముఖ్యమైన గమనిక ఏమిటంటే, మీరు మీ ఫోన్లు ను పోగొట్టుకున్నట్లైతే వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయడం లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేయాలి. మీ సిమ్ కార్డు నెంబర్ తో వెంటనే వేరే సిమ్ కార్డు తీసుకోవాలి.లేదంటే మీ ఫోన్ కొట్టేసిన నిందితుల వాటిని ఎన్నో రకాలుగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. తర్వాత మీరు అందులో ఇరుక్కోవలసి ఉంటుంది.ఎందుకంటే ఆ సిమ్ మీ పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంటుందని గమనించుకొని జాగ్రత వహించండి.

Best Mobiles in India

English summary
Police Busted A Gang That Stole Mobile Phones To Use For Other Crime. 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X