Just In
- 13 hrs ago
Signal యాప్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చే వాట్సాప్ ఫీచర్లు ఇవే...
- 1 day ago
WhatsApp వెబ్ ఇంటర్ఫేస్లో కాలింగ్ ఫీచర్స్!! న్యూ అప్డేట్ మీద ఓ లుక్ వేయండి...
- 1 day ago
విద్యార్థులకు ఉచిత laptop లు, గ్రామాల్లో Unlimited ఇంటర్నెట్. AP సర్కార్ ఆలోచన.
- 1 day ago
JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ అరుదైన రికార్డ్!!
Don't Miss
- News
దేశ రాజధానిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి, కానీ..: పాక్ కుట్ర జరిగిందని ఢిల్లీ పోలీసులు
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఢమాల్, కంపెనీలు బేజారు
కరోనా దెబ్బ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై బలంగానే తాకింది. దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి.

ఇదిలా ఉంటే వచ్చే డిసెంబరు నెలలో అమ్మకాలు మరింత తగ్గుతాయనే విషయం ఆందోళన కలిగిస్తుందని కౌంటర్ రీసెర్చ్ తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి.

డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు
పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్‌మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి.
Also Read: Flipkart లో Samsung ఫోన్లపై భారీ ఆఫర్లు ! Galaxy S20+ పై రూ.33 వేలు తగ్గింపు ...

అత్యధికంగా ఎగుమతులు నమోదు
ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు.ఇక ఆన్లైన్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్‌గా పేర్కొనే ఈ కాలంలో ఆన్లైన్ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్‌చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ నివేదిక వివరాలను విడుదల చేసింది. నిజానికి 7 బిలియన్ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్‌సీర్ ఈ సందర్భంగా పేర్కొంది.

66 శాతం వాటాను సొంతం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్
గతేడాదితో పోలిస్తే ఆన్లైన్ కస్టమర్లలో ఈ ఏడాది 88 శాతం వృద్ధి నమోదైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి నమోదైన 4 కోట్లమంది వినియోగదారుల కారణంగా అధిక వృద్ధి సాధ్యమైంది. కాగా.. అమ్మకాలలో ప్రధానంగా మొబైల్ ఫోన్ల హవా కనిపించింది. అయితే చిన్న పట్టణాల నుంచి పెరిగిన కొనుగోలుదారుల నేపథ్యంలో ఒక్కో కస్టమర్‌పై సగటు ట్రేడ్ విలువ అంటే జీఎంవీ రూ. 7,450 నుంచి రూ. 6,600కు తగ్గింది. అంచనాల ప్రకారం మొత్తం అమ్మకాలలో 66 శాతం వాటాను ఫ్లిప్‌కార్ట్ సొంతం చేసుకుంది. తాజా పండుగల అమ్మకాల ప్రకారం దేశీయంగా ఈకామర్స్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే బిగ్ బిలియన్ డేస్ విక్రయాలలో ఫ్లిప్‌కార్ట్ ఈసారి 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదేవిధంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల నుంచీ కస్టమర్లను ఆకట్టుకుంది.

గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికం
సుమారు 600 మంది అమ్మకందారులు రూ.కోటికిపైగా విలువైన విక్రయాలు సాధించగా.. 6387 పిన్‌కోడ్స్ నుంచి సెల్లర్స్‌కు ఆర్డర్లు లభించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక 6,500 మంది విక్రేతలు రూ. 10 లక్షలకుపైగా విలువైన అమ్మకాలను సాధించినట్లు తెలియజేసింది. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించినట్లు పేర్కొంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190