ఆడ్వాన్స్ బుకింగ్ మొదలు!!

Posted By: Staff

 ఆడ్వాన్స్ బుకింగ్ మొదలు!!

 

అత్యధిక మంది వినియోగదారులచే గుర్తింపు పొందిన బ్రాండ్ ‘ఎల్‌జీ’ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ‘ఆప్టిమస్ ఎల్3’ని ఈ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా పరిచయం చేసింది. ఈ హ్యండ్‌సెట్‌ను ఆవిష్కరించి రెండు నెలలు గడుస్తున్నా మార్కెట్ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, ఫ్లిప్‌కార్డ్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ సైట్లు ఆప్టిమస్ ఎల్ 3కి సంబంధించి ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తున్నాయి. ధర రూ.7,949.

ఈ ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే... డివైజ్ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయునున్నారు. 3.2 అంగుళాల టీఎఫ్‌టీ శ్రేణి టచ్‌స్ర్కీన్ ఉత్తమమైన రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 3 మెగా పిక్సల్ కెమెరా డిజిటల్ జూమ్, వీజీఏ వీడియో రికార్డింగ్, జియోట్యాగింగ్ , ఆటో ఫోకస్ వంటి అత్యాధునిక ఫోటోగ్రఫీ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన 800 మెగాహెడ్జ్ ప్రాసెసర్ మొబైల్ పనితీరును సమర్థవంతంగా నిర్వహిస్తుంది. వై-ఫై కనెక్టువిటీ సాయంతో వేగవంతమైన నెట్‌బ్రౌజింగ్ నిర్వహించుకోవచ్చు. బ్లూటూత్ వ్యవస్థ డేటాను ఏ విధమైన అవాంతరాలు ఏర్పడకుండా షేర్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot