ఏది నిజం...?

నోకియా ప్రకటించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘808 ప్యూర్ వ్యూ’ ధర విషయంలో వ్యక్తమవుతున్న పుకార్లను నోకియా వర్గాలు ఖండించాయి. ఫోన్ ఆవిష్కరణ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేస్తామని ఈ సందర్భంగా నోకియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 41 మెగా పిక్సల్ కెమెరా ప్రధాన ఆకర్షణగా రూపుదిద్దకుంటున్న ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను తొలిగా 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయం చేశారు. ఈ ఫోన్‌లోని ఇమేజింగ్ అల్గోరిథంలను నోకియా, కార్ల్‌జిస్ ఆప్టిక్స్‌లు అభివృద్ధి చేసాయి. ఈ ఫోన్‌లను తొలిగా భారత్, రష్యాలలో విక్రయించనున్నారు. ఉత్తమ మొబైల్ డివైజ్ అవార్డును ‘నోకియా ప్యూర్ వ్యూ’ దక్కించుకుంది.
వెబ్ ప్రపంచంలో హల్‍చల్ చేస్తున్న పలు నివేదికలు నోకియా ప్యూర్ వ్యూ 808 ధరను రూ.29,999గా ప్రకటించాయి. ఈ రూమర్ పై స్సందించిన నోకియా అధికార ప్రతినిధి ఒకరు ‘ధరకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆ సమాచారం ఖచ్చితమైనది కాదని, ఖచ్చితంగా డమ్మిదని’ స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ నికర ధరను ఆవిష్కరణ సమయంలో మాత్రమే ప్రకటిస్తామని వెల్లడించారు. నోకియా ప్రకటన నేపధ్యంలో ‘నోకియా ప్యూర్ వ్యూ 808’ దర రూ.30,000 పైనే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్ బుయ్ ద ప్రైస్.కామ్ ( buytheprice.com) ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ముందస్తు బుకింగ్ లను తెరిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎమ్‌ఆర్‌పి ధర రూ33,999గా, అమ్మకపు ధరను రూ.32,000గా ప్రకటించింది. ఈ ధరను నోకియా వర్గాలు దృవీకరించాల్సి ఉంది.
నోకియా 808 ప్యూర్ వ్యూ ముఖ్య ఫీచర్లు:
4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),
1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,
512ఎంబీ ర్యామ్,
15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,
3జీ కనెక్టువిటీ,
వై-ఫై,
జీపీఎస్ సపోర్ట్,
బ్లూటూత్,
41 మెగాపిక్సల్ కెమెరా,
1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,
32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,
1400mAh లియాన్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








