త్వరపడండి 'ముందు బుకింగ్స్' మొదలయ్యాయి...!

Posted By: Prashanth

త్వరపడండి 'ముందు బుకింగ్స్' మొదలయ్యాయి...!

 

స్మార్ట్ ఫోన్స్ రాకతో ఒక్కసారి అమాంతం సేల్స్‌ని పెంచేసిన ప్రముఖ మొబైల్ కంపెనీ 'శాంసంగ్' కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనున్న 'శాంసంగ్ గెలాక్సీ ఏస్ ప్లస్' స్మార్ట్ ఫోన్‌ని బుకింగ్ చేసుకోవాలనుకునే వారు ఫ్లిఫ్‌కార్ట్. కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మార్చి 21 నుండి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ 16,750.

శాంసంగ్ గెలాక్సీ సిరిస్‌లో ముందుగా విడుదల చేసిన గెలాక్సీ ఏస్ స్మార్ట్ ఫోన్‌తో పోలిస్తే 'శాంసంగ్ గెలాక్సీ ఏస్ ప్లస్' చాలా ప్రత్యేకతలున్నాయి. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.6 ఇంచ్‌లుగా రూపొందించబడింది. గెలాక్సీ ఏస్ మాదిరే స్క్రీన్ రిజల్యూషన్ 320 x 480 ఫిక్సల్స్. అంతేకాకుండా ఇందులో 1 GHz సింగిల్ కోర్ పవర్ పుల్ ప్రాససెర్ని నిక్షిప్తం చేశారు.

ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ప్రస్తుతం జింజర్ బ్రెడ్‌తో రన్ అవుతున్నప్పటికీ... రాబోయే కాలంలో దీనిని ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్ గ్రేడ్ చేయనున్నట్లు శాంసంగ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో మార్కెట్లో ఉన్న ఎల్‌జీ ఆప్టిమస్ సోల్, మోటరోలా డెఫీ ప్లస్, సోనీ ఎక్స్‌పీరియా నియో వి, నియో రే లాంటి మొబైల్స్‌కు శాంసంగ్ గెలాక్సీ ఐసే ఓ ఛాలెంజింగ్‌గా నిలవనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot