అదిరేటి ఫీచర్స్‌తో 'హెచ్‌టిసి మై టచ్'

Posted By: Staff

అదిరేటి ఫీచర్స్‌తో 'హెచ్‌టిసి మై టచ్'

స్మార్ట్ పోన్స్ సెగ్మెంట్‌లో ప్రపంచంలో నెంబర్ వన్‌ కావాలని కష్ట పడుతున్న మొబైల్ కంపెనీలలో హెచ్‌టిసి ఒకటి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లలో హెచ్‌టిసివి కూడా కొన్ని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మంచి కస్టమర్ సపోర్టు ఉన్న కంపెనీ హెచ్‌టిసి. ఇక ఇండియాలో హెచ్‌టిసి మెయిన్ ఫోకస్ అప్పర్, మిడిల్ క్లాస్ ప్యామిలీలను దృష్టిలో పెట్టుకోని తనయొక్క ఉత్పత్తులను తయారు చేసింది. అందుకే ఇండియాలో ఉన్న అప్పర్ క్లాస్ ఫ్యామిలీలలో ఎక్కువ మంది హెచ్‌టిసి మొబైల్ కస్టమర్స్‌ను కలిగి ఉంది.

హెచ్‌టిసి త్వరలో ఇండియాలో కొత్త మొబైల్ పోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దాని పేరే హెచ్‌టిసి మై టచ్(HTC My Touch ). ఇప్పటి వరకు ఇండయాలో హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసినటువంటి అన్ని మొబైల్ పోన్స్‌లతో పోల్చితే ఈ మొబైల్ ఫోన్ చాలా తక్కువ రేటుకే లభిస్తుందని అంటున్నారు. My Touch చూడడానకి చాలా చిన్నగా అందంగా టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. యూజర్స్‌కి మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా ఉంటుంది. My Touch గనుక మీ చేతిలో ఉంటే మీరు ఎంత దూరం ప్రయాణించినా మీకు బోరు అనిపించదు. అందుకు కారణం ఈ మొబైల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని లెటేస్ట్ కొత్త మల్టీ మీడియాని సపోర్టు చేస్తుంది.

ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మీకు చక్కని మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది మిమ్మల్ని ఎంత మాత్రం ఇబ్బంది పెట్టదు. అందుకు కారణం My Touch లో ఉన్న కెమెరాకి డిజిటల్ జూమ్, ఎల్ ఈడి ప్లాష్ ఉన్నాయి. ఈ కెమెరాతో మీర చక్కని క్లారిటీగా ఉండేటటువంటి వీడియోస్‌ని కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 3జి కనెక్టివిటికి అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయినటువంటి బ్లూటూత్, వై-పై, పర్సనల్ కంప్యూటర్‌కి అనుసంధానం చేయడానికి వీలుగా ఇందులో పిసి సింక్రనైజేషన్ కూడా ఉంది. ఇక My Touch 2.2 ఫ్రోయో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని రన్ చేయడానికి ఇందులో 800 MHz ప్రాససెర్ ఉంది.

The notable My Touch features:

Android 2.2 Froyo OS
Expandable memory of up to 16 GB
3G connectivity
3 Mega Pixel Camera.
Music Player
Bluetooth and Wi-Fi
Java support

ఇక ఈ మొబైల్ ఇండియాలో గనుక విడుదలైతే హాట్ కేకుల్లా అమ్ముడై పోతాయని హెచ్‌టిసి వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీని ధర కూడా కేవలం రూ 9000 గా నిర్ణయించడం జరిగింది. హెచ్‌టిసి కంపెనీ నుండి ఇండియాలో అన్ని ఫీచర్స్‌తో విడదలై అతి తక్కువ ధర కలిగిన మొబైల్ ఇదేనని అంటున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot