జ్ఞాపకాలను షేర్ చేసుకొవడానికి హెచ్‌టిసి స్టేటస్

Posted By: Super

జ్ఞాపకాలను షేర్ చేసుకొవడానికి హెచ్‌టిసి స్టేటస్

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకోని నిలబడడానికి కంపెనీలు రోజుకొక కొత్త మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సరిగ్గా అలాంటి పనే హెచ్‌టిసి కంపెనీ చేస్తుంది. హెచ్‌టిసి తన అమ్ముల పొది నుండి మరో క్రొత్త మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరే హెచ్‌టిసి స్టేటస్. హెచ్‌టిసి విడుదల చేయనున్న ఈ మొబైల్ ఫోన్ ఎవరిని దృష్టిలో పెట్టుకోని విడుదల చేయడం జరుగుతుందంటే ప్రపంచంలో సోషల్ నెట్ వర్కింగ్ వాడే వారి సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగి పోతుండడంతో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకోని ఈ మొబైల్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ మొబైల్ వల్ల మీకు సంబంధించిన షేరింగ్ మూమెంట్స్ అన్నింటిని మీ స్నేహితులతోటి ప్రతిరోజు పంచుకోవచ్చు.

ఫోన్స్‌లో రకాలుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ని గనుక మనం చూసినట్లైతే అవి బిజినెస్‌కి సంబంధించినవి కాగా, మల్టీమీడియా ఫోన్స్ తీసుకుంటే అవి మన యొక్క భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడతాయి. ఈ మొబైల్‌లో మొత్తం ఇన్పర్మేషన్ ఒక్కటచ్‌తో పోందగలుగుతారు. ఇందులో మీరు గనుక ఫేస్‌బుక్‌కి కనెక్ట్ అయి ఉంటే అవతలి వైపు ఉన్నకాలర్‌కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ పోందగలుగుతారు. మీ స్నేహితుల ఇన్పర్మేషన్ మీ చేతిలో గనుక ఉంటే మీయొక్క జ్ఞాపకాలను, తీపి గుర్తులను, మీకు నచ్చిన వారితో ఇట్టే పంచుకునే అవకాశం ఉంది.

హెచ్‌టిసి స్టేటస్ చూడడానికి దీర్ఘచతురస్రాకారం(66.5 x 114.4 x 10.8 millimeters)లో ఉండి చుడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇక దీని స్టయిల్ విషయానికి వస్తే ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే హార్డ్ వేర్, మొమొరీ, స్పీడ్ అన్ని చాలా అనుకూలంగా ఉంటాయి. మొబైల్‌తో పాటు 512 MB మొమొరీని ఇవ్వగా మొమొరీని విస్తరించేందుకు గాను దాదాపు 32GB వరకు సపోర్ట్ చేస్తుంది.

Some key HTC Status Specifications:

A 2.3.3 Android O.S
4.9 MP camera
FM radio
512 MB RAM
Mono loud speaker and basic 3.5mm Audio outlet
Qwerty key pad
Bluetooth 3.0

హెచ్‌టిసి
స్టేటస్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవతుంది. హెచ్‌టిసి
స్టేటస్‌లో డిప్లే అనేది కీరోల్ పోషిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని మల్టీమీడియా ఫార్మెట్స్ లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న కెమెరాతో చక్కని ఫోటోలను తీయవచ్చు. ఇక కనెక్టివీటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ సౌకర్యం ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot