వన్ ఇండియా రీడర్స్ కోసం ఎల్‌జీ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్స్

Posted By: Super

వన్ ఇండియా రీడర్స్ కోసం ఎల్‌జీ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ ఫీచర్స్

రాబోయే కొన్నినెలల్లో ఎల్‌జీ మరికొన్ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండ్ సెట్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్లో ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్లు విడుదల చేసినటువంటి లీక్డ్ ఇమేజిలు, ఫీచర్స్‌ను బట్టి ఎల్‌జీ కంపెనీ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ ఫోన్ గురించిన సమాచారం వన్ ఇండియా రీడర్స్‌కు ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది..

ఎల్‌జీ విడుదల చేయనున్న కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ పేరు ఎల్‌జీ విక్టర్. ఎల్‌జీ విక్టర్ పుల్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండి, యూజర్స్‌కి చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకుగాను స్క్రీన్ సైజు 3.8 ఇంచ్‌గా రూపోందించడం జరిగింది. స్క్రీన్ సైజు పెద్దదిగా ఉండడంవల్ల యూజర్స్ చక్కని వీడియోలను, ఇమేజిలను ఆస్వాదించవచ్చు. ఎల్‌జీ విక్టర్ మొబైల్ ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ వర్సన్‌తో రన్ అవుతుంది. ఇక హార్డ్ వేర్ విషయానికి వస్తే 1GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, మల్టీ టాస్కింగ్ పనులను చాలా వేగవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మెట్ల(MP3, MP4, AVI, AAC+)ను ఇది సపోర్ట్ చేస్తుంది. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్లు అయిన h263, h264లను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎల్‌జీ విక్టర్ మొబైల్‌తో పాటు ఎఫ్ ఎమ్ రేడియో, యూనివర్సల్ ఆడియో కనెక్టివిటీ, ప్రయివేటుగా స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి మొబైల్ తోపాటు 3.5mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్నటువంటి 5 మెగా ఫిక్సల్ కెమెరాతో 720p ఫార్మెట్ వీడియో రిజల్యూషన్‌తో హై ఢెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు.

హై స్పీడ్ 3జీ నెట్ వర్క్‌కి వీడియో కాలింగ్ ఫీచర్‌ని కూడా సపోర్ట్ చేయడం కోసం మొబైల్ ముందు భాగాన విజిఎ కెమెరా అమర్చడం జరిగింది. మొబైల్ తోపాటు ఇంటర్నెల్‌గా కొంత మొమొరీ వస్తుండగా, మైక్పో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉంది. ఇక కనెక్టివటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ మొదలగున వాటిని సపోర్ట్ చేస్తుంది. 14 Mbps స్పీడ్‌తో 3జీ నెట్ వర్క్స్‌లలో డేటాని ట్రాన్ఫర్ చేస్తుంది.

LG Victor specifications:

Android Gingerbread OS
5 Mega Pixel camera
3G, Wi-Fi and Bluetooth
Java
Up to 32 GB expandable memory
Multi format music and video player

ఇక ఎల్‌జీ విక్టర్‌కు సంబంధించిన ధరను ఇంకా బయటకు వెల్లిడించలేదు. మొబైల్‌ని మాత్రం అక్టోబర్ 2011కల్లా మార్కెట్లోకి తీసుకోని రావాలని సన్నాహాలు చేస్తున్నారు. అత్యాధునికి పీచర్స్ ఉన్నటువంటి ఎల్‌జీ విక్టర్ ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot