మోటరోలా దారిలో సామ్‌సంగ్.. రెండు స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో మోటరోలా తరహాలోనే సామ్‌సంగ్ రెండు గెలాక్సీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించింది. ఈ తాజా ధర తగ్గింపులో భాగంగా రూ.49,900 విలువ చేసే గెలాక్సీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ కేవలం రూ.38,455కే విక్రయిస్తోంది.. మరో స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్ 3 నియో వర్షన్‌ను ధర తగ్గింపులో భాగంగా రూ.27,249కే మీ సొంతం చేసుకోవచ్చు. విడుదల సమయంలో ఈ డివైస్ అధికారిక ధర రూ.38,990. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ రెండు ఆఫర్లను అందిస్తోంది.

 
మోటరోలా దారిలో సామ్‌సంగ్.. రెండు స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపు

గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ తో), 8 కోర్ ఎక్సినోస్ 5 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4కు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం), క్నాక్స్ మొబైల్ సెక్యూరిటీ అప్లికేషన్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై 802.11, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) 3,200 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, ఎస్-పెన్ స్టైలస్.

గెలాక్సీ నోట్ 3 నియో కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ తో), 1.7 గిగాహెట్జ్ హెక్సా‌కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఎ15 + 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ7), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో) 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎస్-పెన్ స్టైలస్ సౌకర్యంతో.

ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన మోటో జీ పై మోటరోలా రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా మోటో జీ 8జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,499కి సొంతం చేసుకోవచ్చు. 16జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ధర తగ్గింపు వివరాలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బుధవారం వెల్లడించింది. మోటరోలా మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-పై, బ్లూటూత్,జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X