iOS 11లో సెక్యూరిటీ అదుర్స్

|

యాపిల్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం iOS 11ను కొద్ది వారాల క్రితం మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యాపిల్ ప్రొడక్ట్స్ అయిన ఐఫోన్స్, ఐప్యాడ్స్ అలానే ఐపోడ్స్ కోసం ఆధునిక హంగులతో అభివృద్ధి చేయబడిన ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఆర్టి‌ఫీషియల్ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతతో పాటు అనేక సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Privacy and Security Settings in iOS 11 you ought to know

2013లో లాంచ్ అయిన ఐపోన్ 5ఎస్ దగ్గర నుంచి 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్‌ వరకు అన్ని ఐఫోన్ మోడల్స్‌లను ఈ iOS 11 సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్ 11లో అందుబాటలో ఉండే ప్రైవసీ అలానే సెక్యూరిటీ సెట్టింగ్స్ గురించిన పూర్తి ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పాస్‌కోడ్ (Passcode)

పాస్‌కోడ్ (Passcode)

iOS 11తో బూట్ అయ్యే ఐఫోన్‌లలో అదనపు సెక్యూరిటీ కోసం 4-digit పాస్‌కోడ్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఈ పాస్‌కోడ్‌ను యూజర్ తన అభిరుచిని బట్టి అంకెల రూపంలో లేదా ఆల్ఫాన్యూమరిక్ పాస్వర్డ్ రూపంలో సెట్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 11 డివైస్‌లలో పాస్‌కోడ్‌ను సెటప్ చేసుకోవాలంటే Settings > Touch ID & Passcode > Change Passcode.

టచ్ ఐడీ (Touch ID)

టచ్ ఐడీ (Touch ID)

యాపిల్ ఐఫోన్‌లను వినియోగించుకునే వారికి Touch ID ఫీచర్ చాలా సుపరిచితం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆధారంగా స్పందించగలిగే ఈ సెక్యూరిటీ ఫీచర్ సౌకర్యంతో ఫోన్ అన్‌లాకింగ్ దగ్గర నుంచి, యాపిల్ పే చెల్లింపులు, ఐట్యూన్స్ ఆథరైజేషన్, యాపిల్ కొనుగోళ్లు వంటి లావాదేవీలను సురక్షితంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఐఓఎస్ 11 డివైస్‌లలో యాపిల్ టచ్ ఐడీ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే Settingsలోని Touch ID & Passcode విభాగంలోకి వెళ్లి మీ ఫింగర్ ప్రింట్‌ను యాడ్ చేసుకోవల్సి ఉంటుంది.

ఫేస్ ఐడీ (Face ID)

ఫేస్ ఐడీ (Face ID)

యాపిల్ ఈ మధ్య కాలంలో అభివృద్ది చేసిన అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లలో Face ID ఒకటి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ iPhone X పై మాత్రమే వర్క్ అవుతోంది. ఈ ఫీచర్ యూజర్ ముఖాన్ని ముందుగానే ఫీడ్ చేసుకుంటుంది. ఆ తరువాత నుంచి ఆ ముఖంతో ఫేస్ ఐడీ మ్యాచ్ అయితేనే డివైస్‌ను అన్‌లాక్ చేయటం జరుగుతుంది. యూజర్ ముఖాన్ని గుర్తు పట్టేక్రమంలో ఫేస్‌ ఐడీ దాదాపు 30,000 ఇన్విజబుల్ లైట్ డాట్‌లను యూజర్ ముఖం పై వేస్తుంది.

ఆటో లాక్ (Auto-lock)

ఆటో లాక్ (Auto-lock)

iOS 11లో నిక్షిప్తం చేసిన ఆటో లాక్ ఫీచర్ ద్వారా ఫోన్ దానంతటకదే లాక్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. మీరు ఫోన్‌ను క్రింద పెట్టినప్పుడు లేదా ఫోన్‌కు దూరంగా వెళ్లినప్పుడు డివైస్ ఆటోమెటిక్‌గా లాక్ అయిపోతుంది. ఈ ఫీచర్‌ను సెటప్ చేసుకోవాలంటే Settings -> Display & Brightness -> "Auto-Lock"

శాంసంగ్‌కు పట్టిన గతే ఆపిల్‌కు, షాకిచ్చిన iPhone 8, iPhone 8 Plus !శాంసంగ్‌కు పట్టిన గతే ఆపిల్‌కు, షాకిచ్చిన iPhone 8, iPhone 8 Plus !

Parked location

Parked location

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని మీ ఐఫోన్‌ను కార్‌కు కనెక్ట్ చేసినట్లయితే, కార్ పార్క్ చేసిన లోకేషన్‌ను ఫోన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేసుకోవాలంటే Settings -> Mapsలోకి వెళ్లి "Show Parked Locations" ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే సరి.

ప్రైవసీ కంట్రోల్ (Privacy control)

ప్రైవసీ కంట్రోల్ (Privacy control)

iOS 11లో నిక్షిప్తం చేసిన ప్రైవసీ కంట్రోల్ ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ లొకేషన్, కాంటాక్ట్స్, క్యాలెండర్స్, ఫోటోస్ ఇంకా ఇతర సెన్సిటివ్ డేటాను వేరొక యాప్ యాక్సెస్ చేసుకోకుండా ప్రైవసీ సెట్టింగ్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ఎయిర్ డ్రాప్ (Air drop)

ఎయిర్ డ్రాప్ (Air drop)

iOS 11లోని బెస్ట్ ఫీచర్లలో Air drop ఒకటి. ఈ ఫీచర్ ద్వారా ఒక డివైస్ నుంచి మరొక డివైస్‌కు సురక్షితంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. మీ లేటెస్ట్ ఐఫోన్‌లో ఎయిర్‌ డ్రాప్ ఫీచర్‌ను వినియోగించుకోవాలనుకుంటన్నట్లయితే ఫోన్ Settingsలోని -> General -> AirDrop ఆప్షన్‌లోకి వెళ్లండి.

ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ (Emergency SOS)

ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ (Emergency SOS)

iOS 11లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఫీచర్ అత్యవసర పరస్థితుల్లో మీ మెడికల్ హిస్టరీ అలానే ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించి క్విక్ యాక్సెస్‌ను ఇస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్ on/off పై 5 సార్లు ఫాస్ట్‌గా ప్రెస్ చేసినట్లయితే స్ర్కీన్ పై పాపప్ బ్లో అవుతుంది. ఈ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఫోన్ Settingsలోని Emergency SOS విభాగంలోకి వెళ్లాలి.

డిఎన్‌డి(DND)

డిఎన్‌డి(DND)

డిఎన్‌డి అంటే డు నోట్ డిస్ట్రబ్ అని అర్థం. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో యూజర్ ఫోకస్ దెబ్బతినకుండా ఈ ఫీచర్‌ చూస్తుంది. DND ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డ్రైవింగ్ సమయంలో కాల్స్ అలానే మెసేజెస్ రావు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే Settings -> Do Not Disturb => Activate.

లొకేషన్ షేరింగ్ (Location sharing)

లొకేషన్ షేరింగ్ (Location sharing)

iOS 11లో పొందురిచిన కొత్త ఫీచర్లలో లొకేషన్ షేరింగ్ సదుపాయం ఒకటి. ఈ ఫీచర్ ద్వారా యూజర్ తన కరెంట్ లొకేషన్‌ను కావల్సిన ఫ్రెండ్‌కు షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫీచర్ డిసేబుల్ చేయాలను కుంటున్నట్లయితే Settings -> Privacy -> Location Services -> Share My Locationలోకి వెళ్లవల్సి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
A few weeks back, Apple rolled out iOS 11 for the iPhone and iPad users. Today, we are going to see the list of privacy and security settings you should check.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X