స్పైస్, ఇంటెక్స్ బాటలో మైక్రో మ్యాక్స్ ‘ప్రొజెక్టర్ మొబైల్’ ..!!

Posted By: Staff

స్పైస్, ఇంటెక్స్ బాటలో మైక్రో మ్యాక్స్ ‘ప్రొజెక్టర్ మొబైల్’ ..!!

భారతీయ మొబైల్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సొంత గూటి బ్రాండ్ ‘మైక్రోమ్యాక్స్’ (Micromax) సరికొత్త ప్రయోగాలతో మార్కెట్లో దూసుకుపోతుంది. ఇంటెక్స్(Intex), స్పైస్ (Spice) కంపెనీల తరహాలో మైక్రో మ్యాక్స్, ‘మైక్రో మ్యాక్స్ X40’ పేరుతో ప్రొజెక్టర్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

149 గ్రాముల బరువు కలిగిన ఈ మొబైల్ ఫోన్ మరిన్ని విశిష్ట ఫీచర్లను కలిగి ఉంది. లిలియాన్ (lilion) 1000mAh బ్యాటరీ వ్యవస్థతో రూపుదిద్దకున్న మైక్రో మ్యాక్స్ X40 2.5 గంటల పాటు నిరంతరం టాక్‌టైం‌ను వినియోగదారుడికి అందిస్తుంది. జీఎస్ఎమ్ (GSM) వ్యవస్థను సపోర్ట్ చేసే ఈ ఇండియన్ బ్రాండ్ X40 2.5 అంగుళాల డిస్‌ప్లే కలిగి 1200 X 1600 రిసల్యూషన్ సామర్ధ్యంతో పనిచేస్తుంది.

ఈ మొబైల్‌లో పొందుపరిచిన ప్రొజెక్టర్ వ్యవస్థ మూవీస్, ప్రెసంటేషన్స్, ఫోటోలతో పాటు తదితర అంశాలను చదునైన ప్రదేశాల్లో తెరసాయం లేకుండా డిమానుస్ట్రేట్ చేస్తుంది. అంటే గోడ మీద, నేలపైన, సీలింగ్ పైనా ఇలా అన్ని ప్రదేశాలలో ఫోన్‌లో స్టోర్ చేసిన విజువల్ కంటెంట్ ను ప్రదర్శించవచ్చు.

మైక్రోమ్యాక్స్ X40లో అనుసంధానించిన ఎంఎస్ వర్డ్ (MS word), ఎంఎస్ ఎక్సీల్ (Excel), పీడీఎఫ్ వంటి డాక్యూమెంట్ వ్యవస్థలు వ్యాపారవేత్తలకు మరింత ఉపయోగపడతాయి. రెండు మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగిన కెమెరాను ఈ మొబైల్‌లో పొందుపరిచారు.

మైక్రో ఎస్‌డీ ఎక్సటెర్నల్ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమరీని 4జీబీకి పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన బ్లూటూత్ వ్యవస్థ ఫైళ్లను ఇతర మొబైళ్లలోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ మొబైల్లో ముందుగానే లోడ్ చేసిన ఈ - బుక్, స్నాప్టు, నైమ్‌బజ్, మండు రేడియో, ఫేస్‌బుక్ తదితర అప్లికేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సగటు వినియోగదారుడు కోరుకుంటున్న అన్ని ఫీచర్లును ఒకే గూటికి తెచ్చి రూపొందించిన మైక్రోమ్యాక్స్ ధర కేవలం రూ.4,200 మాత్రమే, ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరి..!!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot