360 డిగ్రీ కెమెరాతో విప్లవాత్మక ఫోన్

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రోట్రూలీ (ProTruly) ఇటీవల ఓ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

Read More : ఫోన్‌లో బూతు చూస్తే బుక్కైపోతారు జాగ్రత్త..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ProTruly Darling

‘ప్రోట్రూలీ డార్లింగ్' (ProTruly Darling) అనే పేరుతో రాబోతున్న ఈ ఫోన్ 360 డిగ్రీ రేర్ ఫేసింగ్ కెమెరాతో రాబోతోంది. ఈ కెమెరా క్రింది భాగంలో 4 ఖరీదైన వజ్రాలను కూడా ప్లేస్ చేయటం జరిగింది. ప్రపంచపు మొట్టమొదటి వర్చువుల్ రియాల్టీ స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే కావటం విశేషం.

ఫిష్ఐ లైన్స్ (fisheye lens)

ప్రోట్రూలీ డార్లింగ్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సపోర్ట్‌తో వస్తోంది. fisheye lensతో రూపుదిద్దుకున్న ఈ వైడ్ యాంగిల్ కెమెరాతో 360 డిగ్రీ కోణంలో వీడియోలతో పాటు ఫోటోలను కూడా చిత్రీకరిచుకోవచ్చు. ఈ కెమెరాతో క్యాప్చుర్ చేసిన 360 డిగ్రీ షాట్స్ ను ఫేస్ బుక్, యూట్యూబ్ లలో కూడా షేర్ చేసుకోవచ్చు. వీఆర్ కెమెరా మోడ్‌ను కూడా ఈ ఫోన్ కెమెరా సపోర్ట్ చేస్తుంది.

ప్రత్యేకమైన లెదర్ స్ట్రిప్‌

కెమెరా క్రింద భాగంలో నాలుగు ప్రత్యేకమైన వజ్రాలతో కూడిన ప్రత్యేకమైన లెదర్ స్ట్రిప్‌ ఆకట్టుకుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

ప్రోట్రూలీ డార్లింగ్ ఫోన్ స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ అమోల్డ్ డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 3,560mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, శరీర ఉష్షోగ్రతలు పసిగట్టేందుకు థర్మల్ సెన్సార్.

రెండు ఎడిషన్‌లలో...

డార్లింగ్ ఫోన్ రెండు ఎడిషన్‌లలో అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ ఎడిషన్ ధర 600 డాలర్లు (మన కరెన్సీలో రూ.40,000). స్పెషల్ ఎడిషన్ ధర 1300 డాలర్లు (మన కరెన్సీలో రూ.87,000). చైనా మార్కెట్లో నవంబర్, 2017 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ProTruly Darling: Facts about 360-degree camera featuring diamond studded smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot