పబ్‌జీ మొబైల్ ఇండియాలో కొత్తగా 3 ఫీచర్లు

By Gizbot Bureau
|

చైనా ఇండియా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా గతంలో 118 యాప్స్ ని నిషేదించింది. ఆ నిషేదించిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా బాగా పేరు పొందిన 'పబ్ జి గేమ్ కూడా ఉన్న విషయం విదితమే. భారత్ లో ఈ గేమ్ నిషేధించడంతో ఆ ప్రభావం కంపెనీపై బాగానే పడింది. నిషేధంతో ఒక్క సారిగా గేమ్ డౌన్ లోడ్ సంఖ్య తగ్గిపోయింది. అందుకే కంపెనీ తిరిగి భారత్ లోకి రావాలని ప్రయత్నిస్తూ సక్సెస్ అయింది.

పబ్జీ మొబైల్ ఇండియా

తాజాగా పబ్జీ గేమ్ ను "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో తిరిగి దీనిని లాంచ్ చేయనున్నారు. అయితే, గేమింగ్ యాప్ గురించి వస్తున్న వార్తలు గేమింగ్ ప్రియుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పుడు, తాజాగా మరో వార్త బయటకి వచ్చింది. "పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో రాబోతున్న యాప్ లో కొత్తగా 3 ఫీచర్లు తీసుకొస్తున్నారని సమాచారం. ఈ ఫీచర్లు భారతీయ పబ్జి గేమర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

PUBG లో రాబోయే 3 ఫీచర్లు
 

PUBG లో రాబోయే 3 ఫీచర్లు

1. పబ్జీ మొబైల్ ఇండియా" పేరుతో వస్తున్న యాప్లో పాత్రలు ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉండవు. 

2. గ్లోబల్ లేదా కొరియన్ వెర్షన్ వలె కాకుండా దీనిలో గ్రీన్ హీట్ ఎఫెక్టులు రానున్నాయి.

3.యువ ఆటగాళ్లలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడానికి ఆట సమయంలో పరిమితిని ఉంచే సెట్టింగ్స్ సహా అనుకూలించే కంటెంట్ ను కలిగి ఉంటుంది. 

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం, పబ్జీ మొబైల్ ఇండియా డిసెంబర్ మొదటి వారంలో అధికారికంగా విడుదల కానుంది. అయితే, పబ్జీ యొక్క ఇండియన్ వెర్షన్ భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత మాత్రమే విడుదల అవుతుంది. భారతదేశంలో మొబైల్ గేమ్ యొక్క అధికారిక నమోదుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. 

Also Read: Nokia 2.4 ఇండియా లో లాంచ్ అయింది.ధర మరియు బుకింగ్ వివరాలు చూడండి Also Read: Nokia 2.4 ఇండియా లో లాంచ్ అయింది.ధర మరియు బుకింగ్ వివరాలు చూడండి

PUBG మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ

PUBG మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం పబ్జి మొబైల్ ఇండియా ఇప్పుడు రిజిస్టర్డ్ కంపెనీ. కొత్త సంస్థ చెల్లుబాటు కోసం కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్(సిఐఎన్)తో మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్డ్ చేసుకుంది. దీని యొక్క రిజిస్టర్డ్ కార్యాలయం బెంగళూరులో ఉంది. "పబ్జీ మొబైల్ ఇండియా" యాప్ ను ఐఫోన్ యూజర్లకంటే ముందుగానే ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే స్థానిక కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు ఇండియాలోనే యూజర్ల డేటాని నిల్వచేయడానికి మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ గేమ్ కి సంబందించిన టీజర్ ని కూడా విడుదల చేసింది. పబ్‌జీ మొబైల్ గేమ్‌ని అధికారికంగా ప్రారంభించటానికి ముందు పబ్‌జీ కార్పొరేషన్ తన ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది.ఈ నెలలో ఇండియాకు ఈ గేమ్ రానుంది. 

6 కోట్ల రూపాయలు బహుమతి

6 కోట్ల రూపాయలు బహుమతి

తాజాగా భారత పబ్‌జీ ప్రొఫెషనల్ గేమర్ అభిజిత్ అందారే ట్విటర్‌లో ఒక ప్రకటన చేసారు. పబ్‌జీ నిర్వహించబోయే టోర్నీలో గెలిచే ప్లేయర్లకు 6 కోట్ల రూపాయలు బహుమతిగా అందించనున్నారని తెలిపారు. ఇక పబ్జీ గేమ్‌ను ఇండియాలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గేమ్‌ను డెవలప్ చేస్తున్న టైర్-1 డెవలపర్లకు రూ.40వేల నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఈ గేమ్‌కి సంబంధించిన టీజర్ కూడా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది పబ్‌జీ కార్పొరేషన్. కొత్తగా తీసుకొచ్చిన 'పబ్‌జీ మొబైల్ ఇండియా'లో భారత మార్కెట్‌కు తగ్గట్టుగా ఈ గేమ్‌ను డిజైన్ చేస్తోంది.

తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడు బిలియన్లకు పైగా మంది ఏదో ఒక గేమ్ అడుతున్నారని పేర్కొంది. పోకీమాన్ గో, పబ్‌జి మొబైల్ వంటి ప్రసిద్ధ గేమ్ సంస్థలు లాక్డౌన్ సమయంలో స్టే-ఎట్-హోమ్ వంటి ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాయి. 2020 మొదటి తొమ్మిది నెలల్లో గ్లోబల్ మొబైల్ గేమ్ డౌన్‌లోడ్‌లలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.మన దేశ పౌరులు 2020 మొదటి 9 నెలల్లో 7.3 బిలియన్ గేమ్ లను డౌన్లోడ్ చేసుకున్నారు. 

దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ 

దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ 

ప్రపంచవ్యాప్త మొత్తం డౌన్‌లోడ్‌లలో ఇది దాదాపు 17% అని యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ పేర్కొంది. ఈ ఏడాది తోలి త్రైమాసికంలో భారతీయులు దాదాపు1.8 బిలియన్ గేమ్ లను ఇన్స్టాల్ చేసుకున్నారు. తరువాతి త్రైమాసికంలో మన దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల గేమ్ డౌన్లోడ్ 50% పెరిగాయి. దింతో గేమింగ్ ప్రియుల సంఖ్య భారిగా పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో గేమ్ డౌన్‌లోడ్‌లలో వృద్ధి 7% పెరిగి 2.9 బిలియన్ డౌన్‌లోడ్‌లకు చేరుకున్నాయి.

2020 మొదటి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన గేమ్ లలో గారెనా ఫ్రీ ఫైర్ మొదటి స్థానంలో నిలిచింది. తరువాత స్థానాలలో పబ్జి, సబ్వే సర్ఫర్‌ గేమ్ లు నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన గేమ్ లలో ఇన్నర్‌స్లోత్స్ అమాంగ్ గేమ్ మొదటి స్థానంలో ఉంది. గత సంవత్సరంతో పోల్చితే గూగుల్ ప్లే డౌన్‌లోడ్‌లు మొదటి తొమ్మిది నెలల్లో 40% కంటే ఎక్కువ పెరిగాయి, అలాగే ఆపిల్ యొక్క యాప్ స్టోర్ ఇన్‌స్టాల్‌లు గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరిగాయి.

Best Mobiles in India

English summary
PUBG Mobile India re-launch: Know 3 features that will be exclusive for Indian Gamers only

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X