క్రియోసిటీ వీడియో ఫీచర్‌తో సోనీ ఎరిక్సన్ మొబైల్స్‌కి డిమాండ్

By Super
|
Sony Ericsson Xperia
గ్లోబల్ మొబైల్ ప్లేయర్ సోనీ ఎరిక్సన్ కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లలో క్రియోసిటీ వీడియో సర్వీస్‌ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం ఆగస్టు చివరికల్లా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌లలో ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా అండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అన్ని రకాల ఫీచర్స్‌ని కలిగి ఉండి, ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్న విషయం తెలిసిందే. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో సిరిస్‌కు చెందిన ఎక్స్ పీరియో రే, ఎక్స్ పీరియో యాక్టివ్ ఇప్పటికే మార్కెట్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ క్రియోసిటీ వీడియో ఫీచర్‌ని ప్రవేశపెట్టి ఎక్స్ పీరియా మొబైల్ సిరిస్‌కు మరింత అదనపు హాంగులు సృష్టించనున్నారు.

ఐతే మొదటగా క్రియోసిటీ వీడియో ఫీచర్‌ని ఎక్స్ పీరియో మిని, ఎక్స్ పీరియో మిని ప్రో రెండు మోడల్స్‌లలో మాత్రమే ప్రవేశపెట్టి త్వరలో మిగిలిన ఎక్స్ పీరియా సిరిస్ ఫోన్స్ లలో ప్రవేపెట్టడం జరుగుతుందని సోనీ అఫీసియల్స్ తెలియజేశారు. క్రియోసిటీ వీడియో సర్వీస్ వల్ల సినిమాలకు చెందిన స్టూడియోస్ అయిన ఎన్‌బిసి, పారామౌంట్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ , ట్వంటీ సెంచురీ ఫాక్స్, వార్నర్ బ్రదర్స్ లాంటి వాటి నుండి సినిమాలు అద్దెకు తీసుకొని చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్ వల్ల ఇమేజి క్లారిటీ కూడా సూపర్బ్ గా ఉంటుందని తెలియజేశారు.

 

సాధారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ హై రిజల్యూషన్ కెమెరా ఉండడం వల్ల హై డెఫినేషన్ వీడియోస్‌ని రికార్డింగ్ చేయవచ్చు. వీటితో పాటు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన పేస్ బుక్, ట్విట్టర్‌లను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటంటే మీ ఫోన్ గ్యాలరీలోకి వెళ్లి డైరెక్టుగా ఫోటో ఆల్బమ్ క్రింద కామెంట్స్ రాసే అవకాశం ఉంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో సిరిస్ మొబైల్ ఫోన్స్‌లో మీ స్నేహితుల పుట్టినరోజులను కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. దీనికి కారణం హ్యాండ్ సెట్ పై భాగంలోనే క్యాలెండర్ కనిపిస్తుంది కాబట్టి. అంతేకాకుండా రాబోయే ఈవెంట్స్ అన్నింటిని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది.

 

సోనీ ఎరిక్సన్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ క్రియోసిటీ ఫీచర్‌తో కస్టమర్స్ వద్దకు మరింత చేరువ అవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X