క్వాల్కమ్ కొత్త చిప్‌సెట్ Snapdragon 636

|

ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ క్వాల్కమ్ టెక్నాలజీస్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సరికొత్త చిప్‌సెట్‌ను అందుబాటలోకి తీసుకువచ్చింది. హాంకాంగ్ వేదికగా జరుగుతోన్న 2017 క్వాల్కమ్ 4G/5G సమ్మిట్‌లో భాగంగా క్వాల్కమ్ తన Snapdragon 636 చిప్‌సెట్‌ను లాంచ్ చేసింది. క్వాల్కమ్ క్రయో 260 సీపీయూ ఆధారంగా పనిచేసే ఈ చిప్‌సెట్, గతంలో విడుదలైన Snapdragon 630తో పోలిస్తే 40 రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని క్వాల్కమ్ చెబుతోంది.

Qualcomm announces new chipset for mid-range smartphones, Snapdragon 636

ఈ సరికొత్త మొబైల్ చిప్‌సెట్.. 8 క్రయో 260 కోర్‌లను కలిగి ఉంటుంది. X12 LTE మోడెమ్‌ను కూడా ఈ చిప్ సపోర్ట్ చేస్తుంది. 14nm FinFet ప్రాసెస్ పై అభివృద్ధి చేయబడిన ఈ చిప్‌సెట్ సెకనుకు 600Mbps డౌన్‌లోడ్ స్పీడ్ అలానే 150Mbps అప్‌లోడ్ స్పీడును నమోదు చేయగలదని క్వాల్కమ్ చెబుతోంది.

8జీబి ర్యామ్, 24 మెగా పిక్సల్ కెమెరా, ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ 18:9 డిస్‌ప్లే, క్వాల్కమ్ క్విక్ చార్జ్ 4.0 సపోర్ట్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో బిల్ట్ కాబడే స్మార్ట్‌ఫోన్‌లను ఈ చిప్‌సెట్ సపోర్ట్ చేస్తుందని క్వాల్కమ్ వెల్లడించింది. ఫోన్ తయారీ కంపెనీలకు వచ్చేనెల నుంచి ఈ SoC అందుబాటులో ఉంటుంది. త్వరలో లాంచ్ కాబోతోన్న Redmi Note 5, Moto G6 ఫోన్‌లలో ఈ చిప్‌సెట్‌ను వినియోగించే అవకాశముందని సమాచారం.

Qualcomm announces new chipset for mid-range smartphones, Snapdragon 636

ఇదే సమ్మిట్‌లో భాగంగా క్వాల్కమ్ తన మొట్టమొదటి 5జీ మోడెమ్ మొబైల్ చిప్‌సెట్‌ను కూడా అనౌన్స్ చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 5జీ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సింగిల్- చిప్ మోడెమ్ ద్వారా 5జీ కనెక్షన్‌ను మల్టిపుల్ 5జీ క్యారియర్‌ల ద్వారా గిగాబైట్ పర్ సెకన్ డౌన్‌లోడ్ స్పీడ్స్ కంటే వేగంగా ఎస్టాబ్లిష్ చేయగలిగినట్లు క్వాల్కమ్ వెల్లడించింది. అంతేకాకుండా, 28 GHz mmWave యాంటెన్నా మాడ్యూల్‌ను ఉపయోగించుకుని ఓవర్-ద-ఎయిర్ డేటా కనక్షన్‌ను కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగినట్లు క్వాల్కమ్ తెలిపింది.

క్వాల్కమ్ గురించి క్లుప్తంగా..

Qualcomm అనేది యూఎస్‌కు చెందిన ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ. Snapdragon చిప్‌సెట్‌లను క్వాల్కమ్ ఉత్పత్తి చేస్తుంది. మీడియాటెక్ అందించే చిప్‌సెట్‌లతో పోలిస్తే క్వాల్కమ్ ఆఫర్ చేసే చిప్‌సెట్‌లు మరింత ఖరీదైనవి. పనితీరు కూడా అదేవిధంగా ఉంటుంది. హై-ఎండ్ చిప్‌సెట్‌లను తయారు చేయటంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ దిట్ట. Snapdragon అందించే చిప్‌సెట్‌లలో హీటింగ్ సమస్య తక్కువ.

స్నాప్‌డ్రాగన్ గతంలో ఆఫర్ చేసిన 801 చిప్‌సెట్‌‌లో మాత్రం హీటింగ్ సమస్య ఎక్కువుగా ఉంది. ఈ కంపెనీ అందిస్తోన్న చిప్‌సెట్‌లలో స్నాప్‌డ్రాగన్ 836 లేటెస్ట్ మోడల్. ఇండిపెండెంట్‌గా పనిచేయగలిగే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు బ్యాటరీని కూడా చాలా తక్కువుగా ఖర్చు స్తాయి.

చిప్‌సెట్‌ను SoC అని పిలుస్తారు

వాస్తవానికి చిప్‌సెట్‌ను SoC అని పిలుస్తారు. సాక్ అంటే సిస్టమ్ ఆన్ చిప్ అని అర్థం. ఈ SoCలో ఒక్క ప్రాసెసర్ మాత్రమే కాదు బ్లుటూత్, జీపీఎస్, ఎల్టీఈ, వై-ఫై, సెన్సార్స్‌‌కు సంబంధించిన హార్డ్‌వేర్‌ను అమర్చటం జరుగుతుంది. ఈ కారణంగానే చిప్‌సెట్‌ అనేది ఫోన్‌కు అత్యంత కీలకంగా మారింది.

జియో టారిఫ్‌ల్లో భారీ మార్పులు, అన్నీ ప్రియమే!జియో టారిఫ్‌ల్లో భారీ మార్పులు, అన్నీ ప్రియమే!

Best Mobiles in India

English summary
Qualcomm announces new chipset for mid-range smartphones, Snapdragon 636. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X