ప్రపంచపు తొలి 5జీ ఫోన్ ఇదే ! ఆసక్తికర ఫీచర్లు తెలుసుకోండి..

Written By:

2జి శకం ముగిసింది. 3జీ కూడా ముగిసిపోయి కాలం 4జీ వైపు పరుగులు పెడుతోంది. అయితే త్వరలో 4జీ శకం కూడా ముగిసిపోయి 5జీ వైపు అడుగులు వేగంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే దిగ్గజ కంపెనీలు 5జీ ఫోన్లపై దృష్టి సారించాయి. అయితే ఈ 5జీ ఫోన్లు ఏ కంపెనీ ముందు తీసుకొస్తోందనే విషయం ఇప్పుడు టెక్ వర్గాల్లో తెగ ఆసక్తిని రేపుతోంది. ఈ దశలోనే క్వాల్ కామ్ ఉద్యోగి ఒకరు 5జీ ఫోన్ పట్టుకుని ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

2020 కల్లా 5జీ, ముందుగానే రెడీ చేసుకున్న Airtel

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5జీ రిఫరెన్స్ డిజైన్‌తో వచ్చిన ఈ మొబైల్..

క్వాల్ కామ్ ఫస్ట్ వేవ్ 5జీ రిఫరెన్స్ డిజైన్‌తో వచ్చిన ఈ మొబైల్ ను 5జీ ఎంఎ వేవ్ పెర్‍ఫార్మెన్స్‌ను టెస్ట్ చేసి ఆప్టిమైజ్ చేయడానికి రిలీజ్ చేశారు. అయితే ఇదే ప్రపంచపు తొలి 5జీ ఫోన్ అంటూ క్వాల్‌కామ్ ఈ ఇమేజ్‌ని పోస్ట్ చేసింది.

డ్యూయల్ కెమెరాలతో పాటు..

దీనిలో డ్యూయల్ కెమెరాలతో పాటు , బ్యాక్ సైడ్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ లోగో కూడా ఉంది. ఈ ఫోన్ 2/3/4/5జీలకు పనిచేసే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు క్వాల్‌కామ్ ఉద్యోగి తన పోస్టులో తెలిపారు.

5జీ నెట్ వర్క్ ద్వారా..

ఇక 5జీ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ 5జీ నెట్ వర్క్ ద్వారా 1జిబి డౌన్‌లోడ్ చేయడానికి కేవలం 1 సెకను కూడా పట్టదని తెలుస్తోంది. మనం ఇప్పుడు వాడుతున్న వైఫై నెట్‌వర్క్‌ల కన్నా ఇది 100 రెట్లు వేగంతో పనిచేస్తుందని అంచనా.

5జీ అంటే ఏంటీ

3జీ ,4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే దీని వేగం అపరిమితంగా ఉంటుంది. సిగ్నల్ లేని ప్రదేశాల్లో కూడా అపరిమిత వేగంతో మీకు అప్ లోడ్ కాని డౌన్ లోడ్ కాని ఉంటుంది. ఈ వేగం 4జీ కన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది.

జనరేషన్ మధ్య తేడాలు

తొలితరం నెట్‌వర్క్ 1జిలో కాల్స్ మాత్రమే చేసుకునేవారు. దాని తరువాత వచ్చిన 2 నెట్‌వర్క్‌లో కాల్స్‌తో పాటు మెసేజ్‌లు కూడా పంపుకునే స్థాయికి వచ్చింది. ఇక తరువాత వచ్చిన 3జీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది.ఇంటర్నెట్ వాడకంతో అందరూ తెగ ఖుషీ అయ్యారు కూడా. తరువాత వచ్చిన 4జీ ఏకంగా వీడియో కాల్స్‌తో పాటు పెద్ద పెద్ద ఫైల్స్ ను క్షణాల్లో పంపే స్థాయికి వచ్చింది.

5జీ ఉపయోగం

5జీ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక కిలోమీటర్ పరిధిలో దాదాపు మిలియన్ మంది 5జీ నెట్‌వర్క్‌ని అందుకునే కెపాసిటి ఉంటుంది. మిలియన్ మొబైల్స్ కి ఇది ఒకేసారి ఎటువంటి అంతరాయం లేకుండా సపోర్ట్ చేస్తుంది. 3జీ,4జీ కన్నా ఎన్నో రెట్లు వేగంతో అందుకుంటుంది.

డేటా స్పీడ్

5జీ డేటా స్పీడ్ విషయానికొస్తే 4జీ కన్నా 20 రెట్లు వేగంతో కనెక్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే పూర్తి స్థాయి హై ఢెఫినేషన్ సినిమాని కేవలం ఒక సెకండ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5జీ ultra-low latency rate కూడా 1 మిల్లి సెకండ్ ఉంటుంది. అదే 4జీలో అయితే 10మిల్లి సెకండ్స్ ఉంటుంది.

అనుభూతి

ఈ స్పీడ్ లో మీరు ఎటువంటి అంతరాయం లేకుండా వీఆర్ ఏఆర్ లాంటి హై క్వాలిటీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. సిగ్నల్ తక్కువగా ఉన్న సమయంలో కూడా మీకు ఎటువంటి అంతరాయం కలుగదు.

ముందున్న దేశాలు

చైనా , జపాన్, సౌత్ కొరియాలు ఇప్పటికే 5జీ మీద టెస్టింగ్ లు నిర్వహిస్తున్నాయి. 5జీ రిలేటెడ్ మొబైల్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. అక్కడ ఇప్పటికే హై లెవల్ 4జీ సమర్థవంతంగా రన్ అవుతోంది. 5జీ డెవలప్ కోసం ప్రభుత్వం కూడా కంపెనీలకు సపోర్ట్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Qualcomm employee unveils world's first 5G smartphone more news at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot