Home
Mobile

Railway Super App సంక్రాంతికి ముందే రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సూపర్‌ యాప్‌ విడుదలపై క్లారిటీ..!

రైల్వే ఇటీవల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 120 రోజుల ముందస్తు గడువును 60 రోజులకు తగ్గించింది. గత నెలలో ఈ నిర్ణయం వెలువడింది. నవంబర్‌ 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీంతోపాటు లగేజీ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతించిన దాని కంటే ఎక్కువ లగేజీని తీసుకొస్తే, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌ అందనుందని తెలుస్తోంది. ఈ ప్రకటన రైల్వే సేవల కోసం వివిధ రకాల ప్లాట్‌ఫాంలను వినియోగిస్తున్న వారి సమస్యలకు డిసెంబర్‌లో చెక్‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

రైల్వేలో ఏమేం యాప్‌లు ఉన్నాయంటే :
ప్రస్తుతం రైల్వేలో వివిధ సర్వీసుల కోసం అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ల బుకింగ్‌ కోసం IRCTC (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్) వైబ్‌సైట్‌, యాప్‌ ఉంది. అన్‌ రిజర్వడ్‌, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS మరియు ఫిర్యాదులు సహా రివ్యూ, ఫీడ్‌బ్యాక్‌ కోసం రైల్‌ మదద్‌ (Rail madad) ఉన్నాయి.

Railway Super App

వీటితోపాటు రైళ్లలో నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్‌ ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ సర్వీసులు ఉన్నాయి. మరియు ట్రైయిన్‌ ట్రాకింగ్‌ (Train Status) కోసం నేషనల్‌ ట్రైయిన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ వంటి సర్వీసులు వేర్వేరుగా ఉన్నాయి. రైలు ప్రయాణికులు వివిధ అవసరాల కోసం ఈ యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించాల్సి వస్తోంది.

రైల్వే సూపర్‌ యాప్‌ :
అయితే ఈ సర్వీసులు అన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ సూపర్‌ యాప్‌ను (Railway Super App) తీసుకురానుంది. సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (CRIS) ఈ సూపర్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఉన్న IRCTC రైల్‌ కనెక్ట్ యాప్‌తో కొత్త యాప్‌ను ఇంటిగ్రేట్‌ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.

సూపర్‌ యాప్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకురానున్నారు?
ప్రస్తుతం వేర్వేరు రైల్వే సేవల కోసం ప్రయాణికులు వివిధ రకాల థర్డ్ పార్టీ యాప్‌లు వినియోగిస్తున్నారు. ఈ సేవలు అన్నీ ఒకే ప్లాట్‌ఫాం కిందకు వస్తే ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ రైల్వే సూపర్‌ యాప్‌ ఈ సంవత్సరం డిసెంబర్‌ చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం IRCTC యాప్‌ 100 మిలియన్‌ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. మరియు రైల్వేలో ఎక్కువగా వినియోగిస్తున్న యాప్‌గా ఉంది. థర్డ్‌ పార్టీ యాప్‌లు కూడా రైల్వే టికెట్ల రిజర్వేషన్‌ కోసం IRCTC పైన ఆధారపడి పనిచేస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.4270.18 కోట్లుగా ఉంది.

సూపర్‌ యాప్‌పై రైల్వే అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. IRCTC అదనపు సంపాదన కోసం సూపర్‌ యాప్‌ను మరొక మార్గంగా చూస్తోందని తెలిపారు. ఈ యాప్‌ డిసెంబర్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే ఆండ్రాయిడ్‌, iOS యూజర్లకు రెండింటికీ అందుబాటులోకి వస్తుందా లేదా తొలిదశలో ఒకే OS కు సపోర్టు చేస్తుందా అనేది వెల్లడి కావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Railway all in one platform Super App expected to launch date leaked full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X