ఇంటర్నెట్ సౌకర్యంతో కోటి ఉచిత స్మార్ట్‌ఫోన్లు, ఏంటీ ఈ భామా షా పథకం !

దేశంలో సార్వత్రిక సమరం రోజురోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి.

|

దేశంలో సార్వత్రిక సమరం రోజురోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతున్నాయి. ఇందులొ భాగంగా రాజస్థాన్ ఓ అడుగు ముందుకువేసింది. రాజస్థాన్ ప్రభుత్వం భామా షఆ పరివార్ యోజన పథకం క్రింద ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన కోటి స్మార్ట్ ఫోన్లను ప్రజలకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో భామా షా కార్డు గల కోటి కుటుంబాలకు వీటిని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రకటించారు. ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికీ అనేక రకాలైన ప్రయోజనాలు అందుతాయని ప్రభుత్వం తెలిపినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనాన్ని వెలువరించింది.

ట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగిందిట్రాయ్ నిర్ణయంతో టెలికాం దిగ్గజాలకు దిమ్మతిరిగింది

అర్హత గల ప్రతి కుటుంబానికి

అర్హత గల ప్రతి కుటుంబానికి

ఈ పథకం కింద అర్హత గల ప్రతి కుటుంబానికి తొలి విడతగా రూ.500 వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్ముతో వారు ప్రభుత్వం నడిపే ప్రత్యేక స్మార్ట్ ఫోన్ శిభిరంలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

భామా షా యాప్..

భామా షా యాప్..

అటుపైన వారు ఆ స్మార్ట్‌ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్షన్ పొంది భామా షా యాప్ సహా ఇతర యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవాలి.

మరో రూ.500 ..

మరో రూ.500 ..

ఈ పక్రియ విజయవంతం అయినట్లు మెసేజ్ అందగానే రెండో విడతగా మరో రూ.500 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

2019 జనవరిలో..

2019 జనవరిలో..

కాగా 2019 జనవరిలో వసుంధరా రాజే ప్రభుత్వ పదవీ కాలం ముగిసిపోనుంది . వచ్చే ఏడాది శాసనసభకు ఎన్నికలు రానున్నాయి.

ఆధార్ కార్డు గుర్తింపు ప్రాతిపదికగా..

ఆధార్ కార్డు గుర్తింపు ప్రాతిపదికగా..

ఈ పథకం ఆధార్ కార్డు గుర్తింపు ప్రాతిపదికగా బ్యాంకుతో అనుసంధానమై ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు ఈ పథకం పరిధిలో ఉంటాయి.

 

ఆధార్, దాని అనుసంధానించిన బ్యాంకు ఖాతా..

ఆధార్, దాని అనుసంధానించిన బ్యాంకు ఖాతా..

ఈ మేరకు ప్రభుత్వం కరదీపికను విడుదల చేసింది. ఆధార్, దాని అనుసంధానించిన బ్యాంకు ఖాతా లేకుండా భామా షా పథకంలో నమోదు వీలుకాదని ప్రభుత్వం తెలిపింది.

ఆధార్ లేని వారు ..

ఆధార్ లేని వారు ..

ఆధార్ లేని వారు తక్షణం ఆధార్ కార్డును తీసుకోవాలని లేకుంటే భామా షా ప్రయోజనాలు అందవని రాజస్థాన్ ప్రభుత్వం పొందుపరిచిన కరదీపికలో స్పష్టం చేసింది.

ప్రభుత్వం ఎస్ బ్యాంకుతో టై అప్ ..

ప్రభుత్వం ఎస్ బ్యాంకుతో టై అప్ ..

ఈ భామా షా పథకంలో భాగంగా ప్రభుత్వం ఎస్ బ్యాంకుతో టై అప్ అయి ఓ డిజిటల్ వ్యాలెట్ ని ప్రారంభించింది. ఈ వ్యాలెట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న లబ్ధి దారులకు QR కోడ్ తోనూ చెల్లింపులకు వీలవుతుంది.

upiని సపోర్ట్ చేస్తుందా లేదా..

upiని సపోర్ట్ చేస్తుందా లేదా..

ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ యాప్ upiని సపోర్ట్ చేస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఎటువంటి క్లారటీ లేదు. ప్రభుత్వం నుంచి ఈ విషయం మీద అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Rajasthan announces free smartphones with internet for 1 crore families more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X