గిజ్‌బాట్ పాఠకులకు రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

Posted By:

సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ‘రాఖీ పౌర్ణమిని' పురస్కరించుకుని భారతదేశపు అత్యుత్తమ టెక్నాలజీ వెబ్ పోర్టల్ గిజ్‌బాట్ తమ పాఠకులకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలుపుతూ ‘రక్షా బంధన్ స్పెషల్'పేరుతో ప్రత్యేక కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు గిజ్‌బాట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా అందించనుంది. పోటీలో పాల్గొనే వారు ఏమి చేయాలంటే..?

రక్షాబంధన్ స్పెషల్: ఫోటో పంపండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకని గిజ్‌బాట్ నిర్వహిస్తోన్న ‘రక్షా బంధన్ స్పెషల్' కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు, తమ ఆత్మీయులతో రాఖీ పౌర్ణమిని జరుపుకున్న తీరును ఫోటో రూపంలో గిజ్‌బాట్‌ పోర్టల్ ప్రత్యేక మెయిల్ ఐడీకి  పంపవల్సి ఉంటుంది. సదరు ఫోటోగ్రాఫ్ సెల్ ఫోన్ నుంచి చిత్రీకరించినదై ఉండాలి. పంపించే ఫోటో అర్థవంతంగా ఉండి పండుగ శోభను తలపించాలి. ఫోటోకు ప్రత్యేక సందేశాన్ని జతచేస్తే మరీ మంచిది.

పోటీకి సంబంధించి పాటించవల్సిన నిబంధనలు:

- ఒక్కో పోటీదారు ఒక ఫోటోను మాత్రమే పంపాలి.
- గిజ్‌బాట్ రక్షా బంధన్ స్పెషల్ కాంటెస్ట్ ఆగష్టు 20, మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రారంభమైంది.

- కాంటెస్ట్‌లో పాల్గొనే వారు ఫోటోలను మెయిల్ చేయవల్సిన చిరునామాలు gadgets@oneindia.co.in లేదా harishkumar.m@oneindia.co.in.

- గమనించవల్సిన అంశం: అభ్యర్థులు పంపించే ఫోటోలు రాఖీ పౌర్ణిమికి సంబంధించి సెల్‌ఫోన్ నుంచి చిత్రీకరించిన ఫోటోలే అయి ఉండాలి. ఉదాహరణకు: మీ సోదరి మీకు రాఖీ కడుతున్న దృశ్యం లేదా మీ కుటుంబ సభ్యులు రాఖీ పౌర్ణమి వేడుకలనుజరుపుకుంటున్న దృశ్యం.

- ఫోటోను మెయిల్ చేసే సమయంలో మీ పేరు, చిరునామా, సంప్రదించు మొబైల్ నెంబరు, మీ స్మార్ట్‌ఫోన్ మోడల్ వంటి వివరాలను జత చేయండి.

- విజేతను ఆగష్టు 22 అంటే గురువారం నాడు ప్రకటించటం జరుగుతుంది.

గిజ్‌బాట్ పాఠకులకు మరొక్క సారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot