రేజర్ నుంచి 8జిబి ర్యామ్‌తో గేమింగ్ ఫోన్

మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 ను తాజాగా అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో విడుదల చేసింది.

|

మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 ను తాజాగా అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్‌లలో విడుదల చేసింది. రేజర్‌ ఫోన్‌ సిరీస్‌ గేమింగ్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇతర దేశాల్లోనూ ఈ ఏడాది చివరి నాటిక లభ్యం కానుంది. భారీ ర్యామ్‌, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ , ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లాంటి అద్భుత ఫీచర‍్లతో లాంచ్‌ చేసిన ఈస్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ.59,500 గా ఉండనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

మొబైల్స్ వచ్చి ఉండకపోతే ప్రపంచం ఎలా ఉండేది ?మొబైల్స్ వచ్చి ఉండకపోతే ప్రపంచం ఎలా ఉండేది ?

8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌

రేజర్ ఫోన్2లో 5.72 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను అమర్చారు. 8 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు.

 

 రెండు కెమెరాలు ..

రెండు కెమెరాలు ..

వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీనికి క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

రేజర్ ఫోన్ 2 ఫీచర్లు

రేజర్ ఫోన్ 2 ఫీచర్లు

5.72 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మోస్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0, వైర్‌లెస్ చార్జింగ్.

రేజర్ తొలిసారిగా ..

రేజర్ తొలిసారిగా ..

నెక్స్‌బిట్ కంపెనీని సొంతం చేసుకున్నాక రేజర్ తొలిసారిగా విడుదల చేసిన రేజర్ ఫోన్ విడుదల చేసింది. అల్ట్రామోషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్ ప్రియులకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
Razer Phone 2 Gaming Smartphone With Wireless Charging Support, True 120Hz Display Launched: Price, Specifications more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X