రూ. 5499కే 4జీ వోల్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్

|

దేశీయ మొబైల్ దిగ్గజం రీచ్ మొబైల్ సంస్థ 4జీ వోల్ట్ సపోర్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. అల్యూర్ రైజ్‌న పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.5,499గా నిర్ణయించింది. Black and Gold వేరియంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.ఈ ఫోన్లో ముందు, వెనుక భాగాల్లో ఉన్న రెండు కెమెరాలకు ఫ్లాష్ సదుపాయం కల్పించారు. కాగా కంపెనీ లాంచింగ్ ఆఫర్లో భాగంగా రిలయన్స్ జియో ద్వారా రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. ఈఫోన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం అయిన Flipkart and Shopcluesలో కొనుగోలుదారులు కొనుగోలు చేయవచ్చు.

 
రూ. 5499కే 4జీ వోల్ట్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్

రీచ్ అల్యూర్ రైజ్ ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ.

రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?రూ.200కే Jio టీవి సేవలు, సిమ్‌తో జియో ల్యాపీలు, రిలీజ్ తేదీ ఎప్పుడంటే ?

కాగా ఈ ఫోన్ షియోమి Redmi 5A and Tenor Dకి పోటీగా నిలవనుంది. అయితే ఆ ఫోన్లలో ఫీచర్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. రీచ్ అల్యూర్ రైజ్ ఫోన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్తో రాగా Redmi 5A and Tenor Dలు Snapdragon 425 processorతో వచ్చాయి. అలాగే ఈ ఫోన్లో 2600 ఎంఏహెచ్ బ్యాటరీ నిక్షిప్తం చేయగా Redmi 5Aలో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, Tenor Dలో 3500 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. అయితే ఇది ఇండియా తయారీదారు కావడంతో యూజర్లను ఆసక్తి చూపే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Best Mobiles in India

English summary
Reach Allure Rise Entry-Level Smartphone Launched In India For Rs. 5,499 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X