త్వరలో 108 మెగాపిక్సెల్ కెమెరాతో Realme నుంచి మరో స్మార్ట్ ఫోన్!

|

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ Realme, ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ధరల్లో మొబైల్స్ ను విడుదల చేస్తోంది. అంతేకాకుండా, వినియోగదారుల యొక్క ఇష్టమైన బ్రాండ్లలో ఒకటిగా గుర్తించబడింది. ప్రస్తుతం Realme కంపెనీ కొత్త Realme 10 సిరీస్‌ను వినియోగదారులకు పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ కాగా, ఇప్పుడు Realme 10 ప్రో ప్లస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.

 
త్వరలో 108 మెగాపిక్సెల్ కెమెరాతో Realme నుంచి మరో స్మార్ట్ ఫోన్!

Realme కంపెనీ నుంచి రాబోయే కొత్త Realme 10 Pro Plus స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. దీని ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యంతో వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

ధర మరియు లభ్యత;

ధర మరియు లభ్యత;

Realme 10 Pro Plus స్మార్ట్‌ఫోన్ మొదట నవంబర్ 17న చైనాలో లాంచ్ అవుతుంది. దీని తర్వాత ఇది భారతదేశంలో కూడా లాంచ్ అవుతుంది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర CNY 1,999 (దాదాపు రూ. 22,808) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

డిస్ప్లే,  మరియు డిజైన్;

డిస్ప్లే, మరియు డిజైన్;

Realme 10 Pro Plus స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2412 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ డిస్ప్లే LCD లేదా AMOLED ప్యానెల్ కాదా అనేది స్పష్టంగా లేదు. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని చెప్పబడింది.

ప్రాసెసర్ ;
 

ప్రాసెసర్ ;

Realme 10 Pro+ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Dimensity 1080 ప్రాసెసర్‌తో అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UIని అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ చేస్తుంది. ఇది 8GB RAM + 128GB, 8GB RAM + 256GB మరియు 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా వస్తుందని అంచనా వేయబడింది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. Realme 10 Pro + 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ప్రధాన కెమెరాలో 108-మెగాపిక్సెల్ సెన్సార్, రెండవ కెమెరా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు మూడవ కెమెరాలో 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. ఇది కాకుండా, దీనికి 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా లభిస్తుందని అంచనా.

బ్యాటరీ బ్యాకప్;

బ్యాటరీ బ్యాకప్;

ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ని కలిగి ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. హాట్‌స్పాట్, బ్లూటూత్, Wi-Fi, USB C పోర్ట్ వంటి ఇతర కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. ఇది కాకుండా, ఇది యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.

అదేవిధంగా, రియల్మీ నుంచి గత నెలలో విడుదలైన Realme Narzo 50i ప్రైమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం:

అదేవిధంగా, రియల్మీ నుంచి గత నెలలో విడుదలైన Realme Narzo 50i ప్రైమ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం:

Realme Narzo 50i ప్రైమ్ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే.. 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉందని రియల్‌మే వెల్లడించింది. ఇది ఆక్టా-కోర్ Unisoc T612 SoC ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఆండ్రాయిడ్ 11-ఆధారిత Realme UI Go ఎడిషన్‌పై ర‌న్ అవుతుంది.

ఇక కెమెరా విష‌యానికొస్తే.. Realme Narzo 50i ప్రైమ్‌లో బ్యాక్‌సైడ్ ఒకే కెమెరా సెట‌ప్ అందిస్తున్నారు. 8-మెగాపిక్సెల్ క్వాలిటీలో AI ప్రధాన కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీలు, మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ వైపున 5-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉన్నాయి. ఇది 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది గరిష్టంగా 4 రోజుల వరకు ఆడియో ప్లేబ్యాక్ మద్దతును అందిస్తుంది. ఇంకా, ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్ (1TB వరకు) ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 4GB RAM మరియు 64GB వరకు ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కలిగి ఉంది. ప్రస్తతం ఇది అమెజాన్ లో రూ.7,999 (3జీబీ ర్యామ్) ధరకు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Realme 10 pro plus coming soon to market with 108 megapixel camera (leaked).

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X