త్వ‌ర‌లోనే భార‌త్ మార్కెట్లోకి Realme 10 మొబైల్‌! ఫీచ‌ర్లు ఇవేనా!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Realme నుంచి త్వ‌ర‌లోనే మ‌రో కొత్త మోడ‌ల్ మొబైల్ రానున్న‌ట్లు తెలుస్తోంది. Realme 10 పేరుతో రాబోయే ఈ కొత్త మోడ‌ల్ మొబైల్ ఇప్ప‌టికే వివిధ సర్టిఫికేష‌న్‌ సైట్‌లలో క‌నిపిస్తూ విస్తృతంగా వార్త‌ల్లోకెక్కుతోంది. గతంలో వ‌చ్చిన‌ నివేదికల ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్ RMX3630 మోడల్ నంబర్‌ను కలిగి ఉన్నట్లు రూమ‌ర్లు వ‌చ్చాయి.

 
త్వ‌ర‌లోనే భార‌త్ మార్కెట్లోకి Realme 10 మొబైల్‌! ఫీచ‌ర్లు ఇవేనా!

ఇంకా, ఇది ఇప్ప‌టికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), ఇండోనేషియా టెలికాం మరియు NBTC సర్టిఫికేషన్ సైట్‌లలోకి క‌నిపించిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. Realme 10 CB టెస్ట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. తాజాగా, ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కూడా కనిపించింది. Realme RMX3630 మోడల్ 2.2GHz ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తున్న‌ట్లు జాబితా చేయబడింది. కాగా, దీనికి MediaTek Helio G99 SoC ప్రాసెస‌ర్ అందిస్తున్న‌ట్లు రూమ‌ర్ల ద్వారా తెలుస్తోంది.

Geekbench జాబితా ప్రకారం, Realme 10 సింగిల్-కోర్ పనితీరు స్కోర్ 483 పాయింట్లు న‌మోదు కాగా.. మరియు మల్టీ-కోర్ పనితీరు స్కోరు 1,668 పాయింట్లుగా న‌మోదు అయింది.అయితే, ఇది ఇటీవలి కాలంలో ఇతర ధృవీకరణ సైట్‌లలో కూడా కనిపించింది. Realme RMX3630 మోడల్ Geekbench డేటాబేస్లో జాబితా చేయబడింది. ఈ మోడల్ ప్రామాణిక 4G వేరియంట్ అని తెలుస్తోంది. ఇది Mali-G57 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ MediaTek Helio G99 SoCని ఫీచర్ చేస్తుంద‌ని జాబితా చేయబడింది. హ్యాండ్‌సెట్ 8GB RAMని క‌లిగి ఉంటుంది. మరియు ఇది Android 12లో రన్ అవుతుంది.

త్వ‌ర‌లోనే భార‌త్ మార్కెట్లోకి Realme 10 మొబైల్‌! ఫీచ‌ర్లు ఇవేనా!

ఇటీవలి నివేదిక ప్రకారం, మోడల్ నంబర్ RMX3630తో కూడిన Realme 10 BIS, ఇండోనేషియా టెలికాం మరియు NBTC సర్టిఫికేషన్ సైట్‌లలో కూడా గుర్తించబడింది. ఈ జాబితాల ప్ర‌కారం ఈ హ్యాండ్‌సెట్ భారతదేశం, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్ మార్కెట్ల‌లో త్వ‌ర‌లోనే విడుద‌ల కావ‌చ్చ‌ని తెలుస్తోంది. Realme 10 మోడల్ CB టెస్ట్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. CB టెస్ట్ సర్టిఫికేషన్‌లో జాబితా చేయబడిన స్మార్ట్‌ఫోన్‌లో 4,880mAh రేట్ సామర్థ్యంతో Li-ion బ్యాటరీ ఉంది. దీని క‌న్నా ముందు ప్రారంభించ‌బ‌డిన Realme 9 4G కూడా 5,000mAh బ్యాటరీతో వ‌చ్చింది.

ప్ర‌స్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Realme 9 4G ఫీచ‌ర్ల‌ను గురించి కూడా తెలుసుకుందాం:
Realme 9 4G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 6.4 అంగుళాల ఫుల్‌-HD+ సూపర్ AMOLED 90Hz అమొలెడ్ ఉంది. ఇది Qualcomm Snapdragon 680 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

Realme 9 4G స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ Samsung ISOCELL HM6 ప్రైమ‌రీ సెన్సార్ తో బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ ఇస్తున్నారు. 8మెగాపిక్సెల్ సూపర్ వైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో మ‌రో రెండు కెమెరాలు ఉన్నాయి. Realme 9 4G స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ డార్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

 

Realme 9 డిజైన్:
రియల్‌మి 9 ఆకర్షణీయమైన హోలోగ్రాఫిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా సన్‌బర్స్ట్ గోల్డ్ కలర్ మోడల్ లైటింగ్ లో అబ్బురపరుస్తు మెరుస్తు ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో సొగసైన ఫ్రేమ్‌ని కలిగి ఉండి సింగిల్ హ్యాండ్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా రియల్‌మి 9 FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లోని 10240-స్థాయి బ్రైట్‌నెస్ తో ఇండోర్ మరియు అవుట్‌డోర్ వినియోగానికి అనువైనదిగా ఉంటుంది. దీని యొక్క మొత్తం డిజైన్, డిస్ప్లే మరియు ఛాసిస్ మెచ్చుకోదగినవి. అదనంగా మీరు బాక్స్‌తో వెనుక ప్యానెల్ కవర్‌ను కూడా పొందుతారు. ఇది ఫోన్‌ను ప్రమాదవశాత్తు డ్రాప్‌ల నుండి రక్షిస్తుంది.

Best Mobiles in India

English summary
Realme 10 smartphone surfaces on geekbench, it may launch soon.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X