100MP & 200MP కెమెరాలతో Realme కొత్త ఫోన్లు లాంచ్! ఇండియాలో సేల్, ధర వివరాలు
Realme 11 Pro 5G సిరీస్ ఈ రోజు గురువారం భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఈ లైనప్‌లో రియల్ మీ 11 ప్రో 5G మరియు రియల్ మీ 11 ప్రో+ 5G మోడల్‌లు ఉన్నాయి.ఇవి ఇంతకు ముందే ఈ ఏడాది మేలో చైనాలో విడుదలయ్యాయి. ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ధరలు మరియు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.
ఈ ఫోన్లు 6.7 అంగుళాల పూర్తి HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి మరియు Mali G68 GPUతో కూడిన ఆక్టా కోర్ 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 7050 SoCలు ఉన్నాయి. గరిష్టంగా 12GB వరకు RAM మరియు 512GB వరకు స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు మూడు విభిన్న రంగుల వేరియంట్‌లలో వస్తాయి. Realme 11 Pro మోడల్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, Pro+ మోడల్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది.

భారతదేశంలో రియల్ మీ 11 ప్రో 5G, రియల్ మీ 11 ప్రో+ 5G ధర, లభ్యత వివరాలు
రియల్ మీ 11 ప్రో 5G యొక్క 8GB + 128GB వేరియంట్ ధర రూ. 23,999 గా ఉంది. అయితే 8GB + 256GB మరియు 12GB + 256GB ఆప్షన్ ల ధర రూ. 24,999 మరియు రూ. 27,999 గా ఉంది. ఈ ఫోన్లు అమెజాన్, రియల్‌మీ వెబ్‌సైట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా జూన్ 16న మధ్యాహ్నం 12 PM IST నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
ఇంకా, ఈ రియల్ మీ 11 ప్రో+ 5G ఫోన్లు రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటాయి. వీటిలో 8GB + 256GB ఎంపిక ధర రూ. 27,999 మరియు హై ఎండ్ 12GB + 256GB ఆప్షన్ ధర రూ. 29,999 గా ఉంది. ఈ ఫోన్ బేస్ మోడల్ వలె అదే ఛానెల్‌ల ద్వారా జూన్ 15న మధ్యాహ్నం 12 PM IST నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రెండు ఫోన్‌లు జూన్ 8న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లాంచ్ యాక్సెస్ అమ్మకానికి అందించబడతాయి, ఇక్కడ కస్టమర్‌లు రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
బ్యాంకు ఆఫర్లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్ యాక్సెస్ ఉన్న కస్టమర్‌లు రియల్ మీ 11 ప్రో+ మోడల్ పై రూ.2,000. రియల్ మీ 11 ప్రో మోడల్ పై రూ.1,500 ఆఫర్ లభిస్తుంది. ఈ రియల్ మీ 11 ప్రో వేరియంట్‌లు రెండూ మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. ఇవి ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్ మరియు సన్‌రైజ్ బీజ్ రంగులలో వస్తాయి.
రియల్ మీ 11 ప్రో 5G, రియల్ మీ 11 ప్రో+ 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు
ఈ ఫోన్లు 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ డిస్‌ప్లేలను 360Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంటాయి. డ్యూయల్ నానో SIM సపోర్ట్ ఉన్న ఇవి, ఆండ్రాయిడ్ 13-ఆధారిత రియల్ మీ UI 4.0 స్కిన్ తో లాంచ్ అయ్యాయి. అలాగే అవి Mali-G68 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7050 SoCలు, 12GB వరకు RAM మరియు 512GB వరకు స్టోరేజీ తో వస్తుంది.
ఇక కెమెరా విభాగం యొక్క వివరాలు గమనిస్తే, బేస్ మోడల్ రియల్ మీ 11 ప్రో 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 100 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ డిస్‌ప్లే ఎగువన మధ్య పంచ్ హోల్ స్లాట్‌లో ఉంచబడింది.
అలాగే, రియల్ మీ 11 ప్రో+ 5G వివరాలు గమనిస్తే ఇందులో సూపర్ OIS మద్దతుతో 200 మెగాపిక్సెల్ శాంసంగ్ HP3 ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. ఇంకా ఈ హ్యాండ్‌సెట్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
ఈ రెండు మోడల్స్ కూడా 5,000mAh బ్యాటరీల తో, రియల్ మీ 11 ప్రో+ లో 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మరియు బేస్ మోడల్ రియల్ మీ 11 ప్రో లో 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications