108MP కెమెరా, 8GB ర్యామ్‌తో Realme 12 5G స్మార్ట్‌ఫోన్.. నేటి నుంచే సేల్ ప్రారంభం..!!
రియల్‌మి సంస్థ భారత్‌లో తన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 12 (5G Realme 12 5G Series) సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 12 5G మరియు రియల్‌మి 12+ హ్యాండ్‌సెట్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 కస్టమ్ UI పైన పనిచేస్తుంది.
రియల్‌మి 12+ 5G స్సెసిఫికేషన్లు :
రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ కీలక ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అదే 'రెయిన్ వాటర్ స్మార్ట్‌టచ్'.. అంటే వర్షాలు లేదా తడి చేతులతో కూడా ఈ ఫోన్‌ను సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ TSMC 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB గరిష్ఠ అంతర్గత స్టోరేజీతో విడుదల అయింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ డెడికేటెడ్ లిక్వడ్ వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంటుంది. మరియు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే రియల్‌మి 12+ 5G హ్యాండ్‌సెట్ OIS మరియు EIS సపోర్టుతో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16MP కెమెరాను అమర్చారు.

రియల్‌మి 12+ 5G స్మార్ట్‌ఫోన్ (Realme 12+ 5G Smartphone) 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20999గా ఉంది. అదే 256GB స్టోరేజీ ధర రూ.21999గా ఉంది. మరియు ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
రియల్‌మి 12 5G స్పెసిఫికేషన్లు:
రియల్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ 2400*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 950 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో విడుదల అయింది. తొలిసారిగా రియల్‌మి ఫోన్ డైనమిక్ బటన్‌ను కలిగి ఉంది. ఈ తరహా బటన్‌ను ఐఫోన్ 15 ప్రో కలిగి ఉంది. ఈ ఫోన్ రైడింగ్ మోడ్‌తో వచ్చింది.

రియల్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు 8+8GB డైనమిక్ ర్యామ్ సహా 128GB స్టోరేజీ వరకు సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల అయింది. మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.
రియల్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ (Realme 12 5G Smartphone) 108MP శాంసంగ్ HM6 కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో 20X జూమ్ సహా సినిమాటిక్ పోర్ట్రెయిట్ మోడల్‌లను కలిగి ఉంది. మరియు రియల్‌మి 12 5G హ్యాండ్‌సెట్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాలను కలిగి ఉంది.

రియల్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ మోడల్ ధర రూ.17999గా ఉంది.
రియల్‌మి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల సేల్, ఆఫర్లు :
ఈ రియల్‌మి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల తొలి సేల్ మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 10న ముగుస్తుంది. ఈ రియల్‌మి 12+ తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.

రియల్‌మి 12 5Gను కొనుగోలు చేస్తే రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఫోన్లను రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ సహా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మెరుగైన కెమెరా సహా కీలక ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








