రియల్‌మి నుంచి 50MP కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!
రియల్‌మీ గత నెలలో రియల్‌మీ 12 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరిస్‌లో భాగంగా రియల్‌మి 12 ప్రో, ప్రో+ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా రియల్‌మి 12 లైట్ (Realme 12 Lite) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ రియల్‌మి 12 లైట్ స్మార్ట్‌ఫోన్ తాజాగా IMEI డేటాబేస్‌లో RMX3890 మోడల్‌తో గుర్తించబడింది. ఫలితంగా ఈ ఫోన్ రియల్‌మి C67 హ్యాండ్‌సెట్‌కు రిబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 685 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

రియల్‌మి 12 లైట్ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల IPS LCD పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. మరియు దీంతోపాటు 1000 నిట్స్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 685 SoC చిప్‌సెట్. Mail G57 MC2 GPU చిప్‌తో జతచేయబడే అవకాశం ఉంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మి UI 4.0 OS పైన పనిచేసే అవకాశం ఉంది. రియల్‌మి 12 లైట్ స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మైక్రో SD కార్డు ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ స్టోరేజీని పెంచుకోవచ్చని తెలుస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
కెమెరాల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా+ 2MP డెప్త్ సెన్సార్‌లు ఉంటాయని సమాచారం. అదే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు LED ప్లాష్‌లైట్ తో వస్తుంది. ఈ రియల్‌మి 12 లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
* రియల్‌మి 12 ప్రో సిరీస్‌ను భారత్‌లో జనవరి 29న లాంచ్ చేశారు. రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల OLED కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 CPU మరియు అడెన్నో 710 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది.
రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5.0 OS ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన మల్టీమీడియా సపోర్టు కోసం ఈ హ్యాండ్‌సెట్ డాల్బీ అట్మా్స్ ఆధారిత స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.
రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications